Better Vision : ఆధునిక కంటి శస్త్రచికిత్స గురించి తెలుసుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
Better Vision Through Surgery

ఈ మద్య చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి కంటి చూపు మందగిస్తోంది. ముఖ్యంగా యువత, పిల్లలే ఈ రుగ్మతతో సతమతమవుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో రోజురోజుకూ కళ్లద్దాల వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు దుమ్ము, ధూళి వంటి కాలుష్యమూ కారణమవుతోంది. శస్త్రచికిత్సను కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ యొక్క వాడకాన్ని పరిమితం చేయడానికి నిర్వహిస్తారు.

సమీపదృష్టి లోపం, దూరదృష్టి లోపం మరియు అసమదృష్టి వంటి సాధారణ స్థాయిలోని వక్రీభవన కంటి లోపాలను సరి చేయడానికి ఉపయోగిస్తారు. లేసిక్‌లో రెటీనాపై పడే కాంతిని కంటి చూసే విధానాన్ని సరి చేసేందుకు కార్నియా ఆకృతిని మార్చడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. లేజర్‌ సర్జరీ రకాన్ని బట్టి కోలుకునే కాలవ్యవధిలో కొన్ని తేడాలుంటాయి. లేసిక్‌లో కార్నియా పై పొర ఎపీథీలియం, దాని అడుగునున్న పల్చని పొరని కలిపి ఫ్లాప్‌లా లేపి సర్జరీ చేస్తారు. ఈ పద్ధతిలో ఎపీథీలియం డిస్టర్బ్‌ కాదు. కాబట్టి కోలుకోవటానికి తక్కువ సమయం పడుతుంది. కంఫర్ట్‌ లెవెల్‌ ఎక్కువగా ఉంటుంది. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికి చూపు క్లియర్‌ అవుతుంది. కానీ సర్జరీ తర్వాత చూపు స్పష్టంగా రావటానికి వారం రోజుల సమయం పడుతుంది. మూడు లేక నాలుగు రోజుల వరకూ కొంత ఇబ్బంది ఉంటుంది.

ముందుకాలంలో సర్జరీ చేసేటప్పుడు ఇంజక్షన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటి అవసరం లేకుండా కేవలం కంట్లో చుక్కల మత్తు మందు వేసి ఆపరేషన్ పూర్తి చేసే వెసలుబాటు ఉంది. దీన్ని టాపికల్ అనస్థీషియా అంటారు. మరీ పెద్ద వసు వారైతే.. నొప్పి అస్సలు తెలియకుండా ఉండాలంటే కంటి చుట్టూరా చిన్న చిన్న ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్ని ఖపెరి బల్బార్ అనస్థీషియా అంటారు. అరుదుగా వచ్చే నొప్పి కూడా భరించలేకపోతుంటే.. కనుగుడ్డు లోపలికి ఇంజక్షన్ ఇస్తారు. దీన్ని ఇంట్రా కేమరల్ మత్తు అంటారు.

శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ద్వంద్వ దృష్టి లేదా చుట్టూ వెలుగు కనిపించడం, ప్రకాశవంతమైన కాంతి చుట్టూ మసక మరియు రాత్రి సమయాల్లో చూడటంలో సమస్యలు వంటి సమస్యలు సంభవించవచ్చు. శస్త్రచికిత్స వలన సంభవించే ఇన్ఫెక్షన్ మరియు వాపులను మందులతో నయం చేయవచ్చు. చాలావరకు ఇతర ప్రభావాలు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కొంతమంది వ్యక్తుల్లో మాత్రమే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. కొన్నిసార్లు, చూపులో కోరుకునే స్పష్టత కోసం మరొక శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు.

Leave a Comment