నోటిలో దంతాలు ఆరోగ్యంగా ఉండటంలో చిగుళ్లు ఎంతో ప్రాధాన్యం కలిగివుంటాయి. చిగుళ్ల సమస్య తలెత్తినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న సమయాల్లో రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నట్లయితే, అది బ్రష్ చేసుకోవడం వల్లనే అని అపోహ పడకండి. చిగుళ్ల అనారోగ్యం వల్లనే రక్తం వచ్చే అవకాశాలున్నాయి. నోటి పరిశుభ్రత లేని కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. నోట్లో బ్యాక్టీరియా వల్ల చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. దంతాల మద్య పాచిని తొలగించకపోవడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగి, చిగుళ్ళు వాపు , రక్తస్రావం జరగుతుంది. చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం గమనించిన తక్షణమై దంత వైద్యుడిని సంప్రదించాలి. స్కేలింగ్ చేయిస్తే ఈ సమస్యను ప్రాధమిక దశలోనే నివారించవచ్చు. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తూ నాళం గోడల మీద ఒత్తిడి పెడుతుంది. ఇదే రక్తపోటు. రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణంగా వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లడమే. ఇలా చిగుళ్ల నుంచి రక్తం కారడం సమస్య బీపీని పెంచడంలో దోహదపడుతుంది. రెండింటికి ప్రధాన కారణం ఆహార విహారాల్లో మార్పులే అని గుర్తెరగాలి.
అధిక శాతం మందికి పంటి ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ ఉండదు. ఆలోపు సెలైన్ వాటర్ లేదా క్లోర్ హెక్సిడిన్ తో నోటిని పుక్కిలించి వేయడం చేయొచ్చు. శరీరంలో విటమిన్ సీ తగ్గిపోవడ వల్ల రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఫలితంగా స్కర్వీ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ కారణంగానే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సీ చాలా చక్కగా పనిచేస్తుంది. విటమిన్ సి తగ్గిపోవడం వల్లనే చిగుళ్ల నుంచి రక్తం కారడమే కాకుండా రక్తపోటు పెరుగకుండా చూస్తుంది. రక్తపు పోటు ఉన్న వారిలో బయటకి ఏమీ లక్షణాలు కనబడవు.
రక్తపోటును తగ్గిచటం, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో విటమిన్ సి పాత్ర ముఖ్యమైనది. విటమిన్ సి స్థాయిలు తక్కువగా గలవారికి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయే ముప్పు ఎక్కువగా ఉండటం మాత్రం నిజమేనని ఫ్రాన్స్ పరిశోధకులు అంటున్నారు. మాత్రలను వేసుకోవటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సీ అధికంగా లభించే నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నివారించవచ్చు. దాంతోపాటు బీపీ పెరిగిపోకుండా చూసుకోవచ్చు.
చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే నోటి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది అంటే సహజమే అనుకోకుండా వైద్యపరీక్షలు చేయించుకొని దాని కారణాలు కనుక్కొని వైద్యం తీసుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.








