Foods With Vitamin C – విటమిన్ C కోసం ఈ ఆహారాలను తీసుకోండి?

By manavaradhi.com

Updated on:

Follow Us

శరీర రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ సి చాలా ముఖ్యమైనది. ఇది శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా రక్షిస్తుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్‌ సి లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్క సారి ఈ సమస్యతో బాధపడితే శరీరం చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది. కాబట్టి మన రోజువారి ఆహారంలో విటమిన్ సి ను ఆహారం లో భాగం చేసుకోవాలి. సి విటమిన్ లభించే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం…

ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి అవసరమైన విటమిన్లు చేరుతాయి. విటమిన్ సి శరీరంలో మంచి సెల్యులార్ గ్రోత్ కు మరియు బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది బాడీ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది , టిష్యురిపేర్ గాయలను మాన్పడం మరియు కొల్లాజెన్ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుంది. విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది. విటమిన్ సి లోపం యొక్క ముఖ్య కారణాలలో ఒకటి స్కర్వి. ఈ స్థితిలో మీకు చాలా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. ఈ వ్యాధి ఎముకల, కండరాల బలంపై ప్రభావం చూపి, రోగ నిరోధక వ్యవస్థ పట్టుతప్పేలా చేస్తుంది. విటమిన్స్ సి లోపం వల్ల అలసట, దంతక్షయం, దంతవాపులు, జాయిట్ పెయిన్ , గాయాలు మాన్పడం, దంతాల్లో రక్తం కారడం, హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు విటమిన్ సి లోపం వల్ల మరికొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

సిట్రస్ ఫ్రూట్ ను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల క్రోనిక్ డిసీజ్ ఆస్తమాను నివారిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచే సెల్స్ ను న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్ మరియు బ్లడ్ స్ట్రెమ్ యాంటీబాడీస్ సర్క్యులేషన్ పెంచుతుంది. విటమిన్ సి లోపం బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ లీకింగ్ , వీక్ బ్లడ్ వెజల్ మరియు హార్ట్ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో హార్ట్ రిస్క్ ను తగ్గిస్తుంది. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, క్యాన్సర్ ఎఫెక్టివ్ గా నివారించడానికి విటమిన్ సి ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా స్కిన్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. విటమిన్ సి హీమోగ్లోబిన్ గ్రహించడానికి సహాయపడుతుంది . రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది . విటమిన్ సి సరిగా అందనప్పుడు శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. కాబట్టి విటిమన్ సి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరం యొక్క కనెక్టివ్ కణజాలల ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల మరో సమస్య చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది . విటమిన్ సి ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి పరిష్కారం పొందవచ్చు . విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ స్ట్రాబెర్రీ, సిట్రస్, టమోటో క్యారెట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చిగుళ్ళనుండి కారే రక్త స్రావాన్ని అరికట్టవచ్చు. జామకాయలలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఒక్క జామకాయలో 62.8 శాతం రోజువారీ కావాల్సిన విటమిన్ సి ఉంటుంది. నిమ్మ జాతి పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో తక్కువ కాలరీలు మరియు సున్నా కొలెస్ట్రాల్ ఉంటాయి. కాలి ఫ్లవర్ క్యాబేజీ కుటుంబానికి చెందిన కాయగూర, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వలన మీ ఆరోగ్యానికి చాలా లాభకరంగా ఉంటుంది.

Leave a Comment