Petroleum Jelly – పెట్రోలియం జెల్లీని ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?

By manavaradhi.com

Published on:

Follow Us
Petroleum Jelly

చలి కాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది .చలి పెరుగుతున్న కొద్దీ చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి మరీ సమస్య.చలికాలంలో ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాల్సిన వస్తువు పెట్రోలియం జెల్లీ. పాదాలు, చేతులు పొడిబారకుండా పెట్రోలియం జెల్లి మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.

వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతోంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతి హీనంగా మారుతుంది. అరికాళ్లు పగిలి ఇబ్బంది పడు తుంటారు. ఈ కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గిపో వడంతో చర్మం రక్షణ శక్తి తగ్గిపోవడం వల్ల దురద వస్తుంది. ముఖం పొడిబారిపోవడం వల్ల పగుళ్లు చోటు చేసుకుంటాయని, చేతులపై పగుళ్ల మాదిరిగా తెల్లటి గీతలు చోటు చేసుకుంటాయని వైద్యులు వివరిస్తున్నారు.

పెట్రోలియం జెల్లీ దాదాపుగా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తూ వస్తున్నాం. దాదాపు ప్రతి చర్మసమస్యకు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తాము. పొడి, పగిలిన చర్మం నుండి చర్మపు దద్దుర్లు మరియు పూతల వరకు, పెట్రోలియం జెల్లీని ప్రతిచోటా వాడతారు. ముక్కు నుండి రక్తస్రావం జరిగినా, జలుబు చేసినా కూడా, దీనిని చికిత్సకు ఉపయోగిస్తారు. సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం కావడం మూలాన చర్మం దెబ్బతింటుంది. దీంతో క్రమంగా నుదుటి మీద ముడుతలు సైతం పెరుగుతాయి. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సన్‌స్క్రీన్ వాడడం మంచిది.

పెట్రోలియం జెల్లీ చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. నుదుటి మీద పెట్రోలియం జెల్లీని రాసి 5 నిమిషాల పాటు వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ప్రతిరోజూ నిద్రించేముందు ఇలా చేస్తే మంచిది. పెట్రోలియం జెల్లి దురద..మంటల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

పెట్రోలియం జెల్లీ మేకప్‌ను తొలగిస్తుంది. రసాయానాలతో కూడిన రిమూవర్‌లకి బదులుగా దీని సాయంతో మస్కారా, లిప్‌స్టిక్‌, ఐలైనర్లను సులభంగా తొలగించవచ్చు. తలకు రంగు వేసుకునేముందు దీన్ని నుదుటిపై భాగాన, మెడదగ్గరా కాస్త రాసుకోండి. దానివల్ల రంగు అంటకుండా ఉంటుంది. నెయిల్‌ పాలిష్‌ వేసుకునే ముందు గోళ్లకు రెండు వైపులా పెట్రోలియం జెల్లీ రాయాలి. దీనివల్ల రంగు చర్మానికి అంటుకోకుండా ఉంటుంది.లిప్‌ స్క్రబ్‌ కోసం పెట్రోలియం జెల్లీతో మసాజ్‌ చేస్తే పెదవులు పగలవు. పెదవులు మృదువుగా తయారవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు సూర్య కిరణాల నుంచి మీ పెదవుల్ని కాపాడుకోవడానికి సన్‌ క్రీమ్‌గానీ పెట్రోలియం జెల్లీని గానీ క్రమం తప్పకుండా పెదవులపై రాసుకోవాలి.

విపరీతమైన చలి కారణంగా ఉదయం లేవగానే చర్మం పొడిగా మారుతుంది. దానికి రాత్రివేళ నిద్రపోయే ముందే చర్మానికి పగుళ్ల నివారణ క్రీములు రాసుకుంటే మంచిది. తద్వారా మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment