Health Care: వయసు పెరిగేకొద్దీ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

By manavaradhi.com

Published on:

Follow Us
Old People

వయసు పైబడుతున్నకొద్దీ … ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఏదో రూపంలో చుట్టుముట్టడం సహజమే. దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవటం ద్వారా వ్యాధుల బారినడకుండా చూసుకోవటంతో పాటు జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే వయసు పైబడుతున్నకొద్దీ దురలవాట్లకు దూరంగా ఉండాలి.

వయసు పైబడుతున్నకొద్దీ ఆహారనియమాలు, అలవాట్లు కూడా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఈ వయస్సులో ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. అందుకే ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెరుగుతున్న వయసు ఆరోగ్య విషయంలో మనకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. యాభై దాటాక శరీరంలో ఏవైనా బాధలు నొప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దంటారు వైద్యులు. ఈ వయసులో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతాయి.

ఛాతీలో నొప్పి, ఆయాసం, వెన్ను భుజాలు మెడలో నొప్పి, చెమటలు పట్టటం, మగతగా ఉండటం లాంటి లక్షణాలు కనబడితే ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే గుండెపోటు విషయంలోనూ ఇలాంటి సూచనలే ఉంటాయి. సరైన బరువుని మెయింటైన్ చేస్తూ, సిగరెట్, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనిని నివారించాలంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురికాకూడదు.

వయసుపెరిగేకొద్దీ తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. పొగ తాగడం లాంటి అలవాట్లకు చెక్ పెట్టాలి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటి అలవాట్లుంటే వెంటనే మానెయ్యాలి. ఎంతకాలం నుంచి పొగ తాగే అలవాటున్నా సరే.. మానేసిన మరుక్షణం నుంచే ఫలితాలు కనిపించటం ఆరంభిస్తాయి. అలాగే మద్యం జోలికి వెళ్లటం తగదు. ఒకవేళ అలవాటుంటే మితం పాటించాలి. అతిగా మద్యం తాగితే కాలేయం, కిడ్నీలు, గుండె వంటి కీలక అవయాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి.

వృద్ధులకు ప్రిస్క్రిప్షన్ మందులతో సమస్యలు ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువ ప్రిస్క్రిప్షన్ మరియు నాన్ ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకుంటారు. వారు చాలా మంది వైద్యులను చూడవచ్చు. కాబట్టి మీ ప్రాథమిక వైద్యుడు తీసుకునే అన్ని మందుల జాబితాను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి, ఓవర్ ది కౌంటర్ కూడా. అప్పుడు మాత్రమే అవసరమైన మందులను వాడటం మంచిది.

మలి వయసులో ఎక్కువ మంది గంజాయి తాగుతున్నారు. 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 4.2% మంది గంజాయిని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గంజాయిలో నొప్పి నివారణ వంటి వైద్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇది ముఖ్యంగా వృద్ధులలో మరియు గుండె జబ్బులు ఉన్నవారిలో సమస్యలను కలిగిస్తుంది. స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు శ్వాస రేటును పెంచుతుంది. ఏదిఏమైనా యాభై దాటాక శరీరంలో కనిపించే మార్పులను అశ్రద్ధ చేయకుండా ఉండటం అన్నివిధాలా మంచిది.

రోజూవారీ ఆహారంలో పండ్లు, రంగురంగుల కూరగాలయలను భాగం చేసుకోవడం ద్వారా 60 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. పండ్లలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంపొదించి శరీరంలోకి హానికారక క్రిముల నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. సంతృప్త కొవ్వు అధికంగా ఉండే వెన్న, ప్రాసెస్డ్ ఫుడ్స్, డిజర్ట్స్ వంటి ఆహారాలను దూరం పెట్టాలి. కూల్ డ్రింక్స్, తీయని డెయిరీ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మాంసాహారులైతే స్కిన్‌లెస్‌ చికెన్‌, చేపలు అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. కనీసం నెలకు ఒకసారైనా బీపీ పరీక్షించి చూసుకోవడం అల‌వాటుగా చేసుకోవాలి.అర్ధ గంటకు తక్కువ కాకుండా ఉండేలా వ్యాయామాలు చేయాలి. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటే 60 ఏళ్ల వయసులో కూడా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.

వయస్సు పెరుగుతుందంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తవహించాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ప్రతి రోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు 60 ఏళ్లులోను ఆరోగ్యంగా జీవించవచ్చు.

Leave a Comment