Blood Pressure : ఇలా కూడా బీపీ పెరుగుతుంది మీకు తెలుసా ?

By manavaradhi.com

Updated on:

Follow Us
Blood Pressure

బీపీ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీకి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.

ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యలకోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే… అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే బీపీ కారణంగా ఇతర అవయవాలకు హాని కలగకుండా ఆపవచ్చు.

అధిక రక్తపోటు రావడానికి కారణాలు ఏంటి ?

  • అధిక రక్తపోటుకు ఎన్నో రకాల కారణాలున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నవారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్‌, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అతిప్రమాద కరమైన ఇన్‌ఫెక్షన్లు, సెప్టిక్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు హార్మోన్ల పని విధానంలో తేడా వస్తుంది.
  • అధిక బరువు ఉన్నవారికి, క్రియాశీలంగా లేనివారికి, మితిమీరి ధూమపానం, మద్యం సేవించేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలున్నాయి. అంతే కాదు తీసుకుంటున్న ఆహారంలోఆరు గ్రాములకు మించి ఉప్పు ఉన్నట్లయితే అధిక రక్తపోటుకు కారణం అదే అని చెప్పొచ్చు. అధికంగా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. అలాగే గురక ఉన్న వ్యక్తుల్లో కూడా బీపీ పెరిగే ప్రమాదం ఉందని అందువల్ల గురకను నియంత్రణలో ఉంచుకోవాలని అంటున్నారు.
  • ఒత్తిడితో కూడిన లైఫ్ స్టయిల్ వల్ల బ్లడ్ ప్రెజర్ తో పాటు మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ ను అధిక మోతాదులో తీసుకోవడం ల్ల కూడా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కొన్ని రకాల జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ రక్తపోటు సమస్యకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు.

హై బీపిని అదుపులో ఉంచుకోనే మార్గాలు ఏంటి…?

  • రక్తపోటును తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను తప్పకుండా పాటించాలి. ఇందులో ప్రధానమైనది అధిక పొట్టను, బరువు తగ్గించుకోవడం. మన బరువు పెరిగే కొద్దీ గుండె మీద రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. ఫలితంగా ఎక్కువ పని చేసి, అనేక సమస్యలకు కారణమౌతుంది. అందుకే ముందు బరువు తగ్గించుకోవాలి.
  • ఆల్కహాల్ తీసుకోనే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ధూమపానానికి, ధూమపానం చేసే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. కాపీ లాంటి కేఫినేటెడ్ పానీయాల వల్ల రక్తపోటు అధికం అవుతుంది గనుక వీటిని కూడా వీలైనంత వరకూ తగ్గించాలి.
  • రక్తపోటు విషయంలో ఉప్పు తెచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదు. రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్ళు, కూరగాయల్లో ఉప్పు ఉంటుంది. శరీరానికి ఇది సరిపోతుంది.
  • ఎక్కువ ఒత్తిడి, ఆందోళన రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఏ విషయంలో ఆందోళన వద్దు. వీలైనంత మేర ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దీని కోసం యోగ, ధ్యానం, వ్యాయామం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రక్తపోటు పరిస్థితి తెలుసుకుంటూ అదుపులో ఉంచుకునేందుకు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతుండాలి.

చాలామందికి తమకు అధిక రక్తపోటు వచ్చిన విషయాన్నీ గమనించ లేకపోతున్నారు. ఇది నిశ్శబ్ద హంతకి. ఎటువంటి లక్షణాలూ కనిపించకుండానే అధిక రక్తపోటు ప్రాణాలను తీసుకుంటుంది. అధిక రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా హైపర్‌టెన్షన్‌ తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆహారం, మెడిసిన్ ల ద్వారా నియంత్రించాలి.

Leave a Comment