శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా.. శరీరం అదుపు తప్పుతుంది. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. లివర్ సమస్యలు తీవ్రమవుతుండటంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అసలు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఏ దశలో చేస్తారు … దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మన శరీరంలో అత్యంత ప్రదానమైన అవయువాల్లో కాలేయం ఒకటి . శరీర వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి పోషకాలు వంట పట్టడానికి తొడ్పడే పైత్యరసాన్ని ఇది విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటి కప్పుడు బయటకు పంపించివెస్తుంది. అంతటి కీలకమైన అవయువం కనుకే కాలేయం దెబ్బతింటే వ్యవస్థలు అన్ని కుప్పకూలతాయి. కాలేయని వైరస్ లు , ఇన్ ఫెక్షల బెడద ఎక్కువే… ముఖ్యంగా హెపటైటిస్ వైరస్ లు ఏమాత్రం అవకాశం దొరికినా దాడిచేసేస్తూ ఉంటాయి. రకరకాల ఇన్ ఫెక్షలను తెచ్చిపెడతాయి. కాలేయం పనిచేయకపోతే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం.
కాలేయ మార్పిడి ఎందుకు చెస్తారు ?
కాలేయ మార్పిడి ఎప్పుడు అవసరమవుతుంది అనే విషయాల మీద అవగాహన ఉండాలి. మన శరీరంలో కాలేయానికి మాత్రమే పునరుత్పత్తి చెందే గొప్పగుణంఉంది. ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్లో ఎక్కువ శాతం కాలేయం వేగంగా పాడైపోవడం వలన పునరుత్పత్తి చెందే అవకాశం తగ్గుతుంది. ఈ ప్రక్రియ కేవలం ఐదుగురిలో ఒకరిలో మాత్రమే జరుగుతుంది. మిగతా వారిలో ఈ ప్రక్రియ జరిగే లోపే కాలేయ పరిస్థితి క్షీణించి మిగతా అవయవాలు కూడా దెబ్బతిని మరణానికి దారితీయవచ్చు. కాలేయం పూర్తిగా దెబ్బతింటే మెదడులో వాపు వస్తుంది. ఈ పరిస్థితి రాకముందే ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్కు తరలించడం అవసరం. ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించక ముందే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాలి. కాలేయ వ్యాధులలో సిరోసిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. ఈ వ్యాధి ముదిరితే కాలేయ మార్పిడి తప్పదు. అయితే, ఇటీవల వృద్ధిచెందిన వైద్య పరిజ్ఞానం వల్ల సిరోసిస్ వ్యాధిని సకాలంలో గుర్తించి.. ముదరకుండా నియంత్రించవచ్చు. కాలేయ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం. కాలేయ మార్పిడి గుండె మార్పిడి అంత సులువు కాదు. ఎందుకంటే కాలేయ మార్పిడిలో.. దాతకు సంబంధించిన కాలేయం ఎలాంటి వ్యాధి లేకుండా ఉండాలి. అంతేకాకుండా రోగికి సరిపడా కాలేయం లభించడం కూడా కష్టమే. అందులోను కాలేయ దాతల సంఖ్య చాలా తక్కువ. ఇక శస్త్రచికిత్స విషయానికి వస్తే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చాలా క్లిష్టమైంది.
కాలేయ మార్పిడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
కాలేయం వ్యాధి ముదిరిపోయి.. రోగి సంవత్సరానికి మించి బతకరని నిర్ధారణ అయిన సందర్భాల్లోనే వైద్యులు కాలేయ మార్పిడిని సూచిస్తారు. కాలేయ మార్పిడి ద్వారా రోగి జీవిత కాలాన్ని పదేళ్లకు మించి పొడిగించే వీలుంది. సాధారణంగా కాలేయ వ్యాధులను ఎ, బి, సి అనే మూడు గ్రేడ్‌లుగా విభజించి మొదట సి, తర్వాత బి కేటగిరీ ప్రాతిపదికన విభజించి ఆ రోగులకు కాలేయ మార్పిడి చేస్తూ ఉంటారు. ఇందుకోసం కాలేయాన్ని బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి సేకరిస్తారు. కాలేయంలో కొంత భాగాన్ని తొలగించినా తిరిగి పూర్తిగా పెరుగుతుంది. ఇంతటి అరుదైన లక్షణం కలిగి ఉంది కాబట్టే కాలేయ మార్పిడి కోసం దాత నుంచి కాలేయంలో కొంత భాగాన్ని మాత్రమే కత్తిరించి స్వీకర్తకు అమరుస్తారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఇద్దరి కాలేయాలు తిరిగి పూర్తి ఆకారాన్ని సంతరించుకుంటాయి. దీంతో ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో జీవించవచ్చు.
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా ఇటివలి కాలంలో బాగా విజయవతం అవుతుంది. అయితే ఆల్కహాల్ ప్యాటీ లివర్, హెపటైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ వరకూ వెళ్లకుండా తమను కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.