Natural Cough remedies – దగ్గు వేధిస్తోందా? – ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుంది!

By manavaradhi.com

Published on:

Follow Us
Natural Cough remedies

సాదారణంగా దగ్గు రానివారంటూ ఎవరూ ఉండరు. సీజన్ మారినప్పుడల్లా కొందరికి జలుబుతోపాటు దగ్గు కూడా వస్తుంటుంది. ఎప్పుడో అలా అరుదుగా దగ్గు వచ్చినా, ఎవరికీ ఆందోళనకరంగా ఏమీ అనిపించదు. కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు కూడా దగ్గు రావచ్చు కాకపోతే, కొద్ది రోజుల్లో లేదా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది.

కొంతమందిలో ఈ సమస్య నెలలే కాదు ఏడాది గడచినా తగ్గకపోవచ్చు. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువమంది డాక్టర్‌ను కలుస్తున్న ఒక పెద్ద కారణం ఈ దగ్గు సమస్యే. దగ్గు అనేది నిజానికి వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల దగ్గు కారణాన్ని కనుక్కుంటే దగ్గుకు వైద్యం కనుకున్నట్లే అవుతుంది.

కొంత మందిలో శ్వాసక్రియలో ఆటంకం ఏర్పడటం వల్ల నిరంతరం దగ్గొస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు రోడ్డుపైన ఉండే దుమ్ము ,ధూళీ పీల్చడం ద్వారా కొన్ని బ్యాక్టీరియాలు ముక్కు ద్వారా లోపలికి చేరతాయి వాటిని బయటకి పంపించే ప్రయత్నంలో విపరీతమైన దగ్గు వస్తుంది. పొడి దగ్గు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అస్ప్రత్రి మందుల కన్నా ఇంట్లోనే మనం చక్కని ఔషదాలు తయారుచేసుకోవచ్చు.

శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమైన మార్గం. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది. వేడిగా కాఫీ లేదా టీ లేదా వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో చాలా పొడిబారి ఉంటుంది మరియు దగ్గు చాలా క్రమంగా పెరుగుతుంటుంది. అందుకు ఆవిరి పట్టిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

అత్యధికుల్లో ఉండే పొగతాగే అలవాటు ఈ సమస్యకు ఒక పెద్ద కారణం. పొగతాగడం మానుకోవాలి. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయడం తప్పనిసరి. ఫ్యాటీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. భోజనం ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ అప్పటికీ ఉపశమనమూ కలగకపోతే, మీకు దగ్గు రావడానికి మరేదో కారణం ఉందని భావించాలి. ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment