Testosterone : టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిందా…అయితే శరీరంలో కలిగే లక్షణాలు ఇవే…!

By manavaradhi.com

Published on:

Follow Us
Natural Ways to Boost Testosterone

టెస్టోస్టిరాన్ ను పెంచుకోవాలంటే, అందుకు మీరు మందులు లేదా హార్మోనుల ఇంజెక్షన్ల మీద ఆధారపడవల్సి వస్తుంది. అలాకాకుండా సహజంగా నేచురల్ పద్దతులను టెస్టోస్టిరాన్ పెంచుకోవాలంటే, కొన్ని సింపుల్ డైటరీ ఆహారాలు తీసుకోవడం మరియు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ లెవల్స్ పెంచుకోవడానికి సహాయపడుతుంది .

మన శరీరంలో జరిగే ఎటువంటి అనేక మార్పులకు, జీవనశైలికి సంబంధించిన వ్యాధులను నివారించడానికి తప్పకుండా మన శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఆశక్తికరమైన విషయం ఏమిటంటే తరచూ బరువులు ఎత్తడం లేదా వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. సాధారణంగా టెస్టోస్టిరాన్ అధిక శరీర బరువు కలిగిన వారిలో తక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. ఇలాంటి వారు బరువును తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం కన్నా అధిక శరీర వ్యాయామాలను చేయడం ద్వారా వారి శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్లు ఎక్కువ స్థాయిలో విడుదల అయినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం మన శరీరంలో విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ పై మాత్రమే కాకుండా ఇతర హార్మోన్లపై కూడా అధిక ప్రభావాన్ని చూపిస్తాయి.కొందరు దీర్ఘకాలికంగా డైట్ ఫాలో కావడం లేదా కేలరీలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ విధమైన ఆహారం తీసుకోవడం ద్వారా పూర్తిగా ఇతర హార్మోన్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది కనుక ఎల్లప్పుడు సమతుల్యమైన ప్రోటీన్లు, కొవ్వు, పిండి పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయి పెరగడంతో పాటు ఇతర హార్మోన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటాయి.

మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియలో ఉల్లిపాయలు ఎంతో దోహదపడతాయి. ఉల్లిపాయలు అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరులు అని చెప్పవచ్చు. ఈ ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయి పెంచుతాయని చాలా అధ్యయనాలు నిరూపించాయి. వెల్లుల్లిలో అధిక భాగం అల్లిసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉండటంతో కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదపడుతుంది.కార్టిసాల్ అడ్రినల్ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది.

మన శరీరం అధిక ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ ఉత్పత్తి కావడంతో టెస్టోస్టెరాన్ హార్మోన్ పై మాత్రమే కాకుండా, ఇతర శరీర పనుల పై అధిక ప్రభావాన్ని చూపుతుంది. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. మన శరీరంలో అనేక మార్పులు జరగడానికి విటమిన్లు ఎంతో దోహదపడతాయి. ఈ విటమిన్లలో విటమిన్ డి కి ఎంతో విశిష్టత కలిగి ఉంది.టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచడానికి విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.

మన శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచడంలో సాల్మన్ చేపలు కీలకపాత్ర పోషిస్తాయి.ఇందులో మెగ్నీషియం, విటమిన్ బి మరియు ఒమేగా -3 లు ఉన్నాయి, ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే ముఖ్యమైన పోషక పదార్థాలు అని చెప్పవచ్చు.

మన శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సరైన ఆహారంతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర నిద్ర పోవడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలన్నీ సాధారణ స్థాయిలో జరుగుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగాలంటే, కచ్చితంగా మన శరీరానికి సరిపడినంత నిద్ర అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు. నిద్ర అనేది సహజ టెస్టోస్టెరాన్ బూస్టర్. ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి, ఎస్ట్రాడియోల్ అని మహిళ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. తద్వారా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

మనం కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పూర్తిగా తగ్గిస్తాయి. టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంపొందించుకోవాలి అనుకునే వారు పూర్తిగా కొన్ని ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. తరచూ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. వీటిలో అధిక భాగం కేలరీలు, చక్కెరలు, ఉప్పు ఉండటంవల్ల తొందరగా శరీర బరువు పెరిగి టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అదే విధంగా తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లలో లేదా ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల శరీరంలో హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.

శరీరంలో శక్తి లేకపోతే టెస్టోస్టిరాన్‌ తక్కువగా ఉన్నట్లు భావించాలి. వయస్సు మీద పడడం, డిప్రెషన్‌ వంటి కారణాల వల్ల కూడా శరీరంలో టెస్టోస్టిరాన్‌ లోపిస్తుంది. నిత్యం 8 గంటల పాటు నిద్రించడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో టెస్టోస్టిరాన్‌ పెరుగుతుంది.

Leave a Comment