HEALTH TIPS : పడక గదిలో సెల్ ఫోన్ వాడుతున్నారా… ఇంక మీఆరోగ్యం అంతే..!

By manavaradhi.com

Published on:

Follow Us

కంప్యూటర్ల మీద పని, స్మార్ట్ ఫోన్ల మీద సమాచారం… ప్రపంచాన్ని దగ్గర చేసినా, నిద్రకు మాత్రం దూరం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్‌ తప్పని సరి మరి. టీవీ.. కంప్యూటర్.. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్.. ఆధునిక ప్రపంచంలో వీటి వినియోగంతో మనిషి జీవితం పెనవేసుకుపోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మనిషి జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. పొద్దుట నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు చాలామంది. ఐతే స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం పొంచి ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వాడే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

మొబైల్ వాడకం పెరిగినకొద్దీ జీవన నాణ్యత తగ్గిపోతుంది. మొబైల్ పక్కన లేకుండా పడుకోలేని పరిస్థితి వస్తోంది. ఏ క్షణంలో మొబైల్ మోగుతోందోనన్న భయం నిద్రలోనూ అనుభవిస్తున్నారు. చిన్న శబ్దానికి కూడా మొబైల్ రింగ్ అనుకుని లేస్తున్నారు. దీనివలన నిద్ర తగ్గుతుంది. నిద్రకు ముందు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడకంతో వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ దెబ్బతీస్తుంది. దీంతో మయోపియా పెరిగిపోతుంని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి వెలువడే బ్లూలైట్ ఒక్క నిద్రలేమికే కారణం కాకుండా అనవసరంగా బరువు పెరగడం, డిప్రెషన్, క్యాన్సర్ తోపాటు గుండె సమస్యలను కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్లు, టీవీ, ల్యాప్ టాప్ , ఇతర గ్యాడ్జెట్లలో బ్లూలైట్స్ ఉంటాయి.నిద్రకు ముందు వీటిని వినియోగించడంవల్ల రాత్రుల్లో సరిగా నిద్రపోలేం. అందుకే రాత్రి నిద్రించడానికి 3 గంటల ముందు వరకు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • నిద్ర వేళకు మెుబైల్ పై గేమ్స్ ఆడటం, పాటలు వినడం వల్ల కంటిపైకి వచ్చిన నిద్ర ఎగిరిపోతుంది. మెుబైల్ నోటిఫికేషన్లతో సగటున ప్రతీ ఒక్కరూ గంటన్నర నిద్రను కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రతిరోజు ఆలస్యంగా నిద్రపోవడంతో పాటు..నిద్రమధ్యలో కూడా లేస్తున్నారు. దాంతో నిద్ర సమస్యలతో పాటు న్యూరో సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ఫోన్‌,టీవీ వంటి రకరకాల వ్యాపకాల వల్ల చాలామంది నిద్రకు సరైన వేళలు పాటించడం లేదు. దాంతో క్రమంగా ఈ తీరు నిద్రలేమికి కారణం అవుతుంది. మనం పడుకోనే ఓ అరగంట ముందుగా ఫోన్‌ని దూరం పెట్టాలి. వీలుంటే అసలు పడకగదిలోకే ఫోన్‌ తీసుకురాకుండా ఉండేలా స్వీయనియంత్రణ పెట్టుకోవాలి.
  • రాత్రి పడకగదిలో మంచంపైకి ఎక్కిన తర్వాత స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ వంటి వాటిలో ఏదైనా పట్టుకున్నారంటే నిద్ర సరిగా పట్టదు. 63 శాతం మంది నిద్రాభంగాన్ని ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కారణం స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే బ్లూలైట్ చాల ప్రమాదకరమైనది… నిద్రించే ముందు కాఫీలు తాగొద్దని చెబుతుంటారు. ఇందులోని కెఫైన్ నిద్రరానీయదు. అయితే, కాఫీ కంటే స్మార్ట్ డివైజ్ ల స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూలైట్ చాలా హానికరమట.

Leave a Comment