Health tips : మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు

By manavaradhi.com

Published on:

Follow Us

మెనోపాజ్‌వల్ల మహిళ్ళల్లో శారీరకంగా, మానసికంగా కొందరిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ దశలో చాలామంది బరువు పెరగడం అనేది మామూలే. అలాగని మహిళలు తమకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా, అవి సహజమే అని భావిస్తే చాలా ఇబ్బందులు తప్పవు. మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

మహిళ యొక్క రుతుక్రమ ప్రక్రియ ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 40-50 ఏళ్ల వ‌య‌సులో సంభవిస్తుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా గర్భధారణ చేయగలిగే సామర్ధ్యం మహిళల్లో నిలిచిపోవడాన్ని సూచించే సహజ ప్రక్రియ ఇది. మ‌హిళ‌ల బీజకోశాల నుంచి ప్రాజెస్టెరోన్, ఈస్ట్రోజెన్ విడుదల నిలిచిపోయినప్పుడు మెనోపాజ్‌ సంభవిస్తుంది. హార్మోన్లు తగ్గడం వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మెనోపాజ్ ద‌శ‌లో శ‌రీరం ఈస్ట్రోజ‌న్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయి. అలాగే ఆండ్రోజెన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. మెనోపాజ్ ద‌శ‌లో శ‌రీరంలో కొన్ని ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. బ‌రువు పెర‌గ‌డానికి, శ‌రీరంపై అవాంఛిత రోమాలు, బ్లాడ‌ల్ కంట్రోల్ త‌గ్గ‌డం, వాజిన‌ల్ డ్రైనెస్, డిప్రెష‌న్, మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్ల‌షెస్.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే మెనోపాజ్ స‌మ‌యంలో.. బ‌రువు పెర‌గ‌డం విభిన్నంగా ఉంటుంది. కాబ‌ట్టి మెనోపాజ్ ద‌శ‌లో బ‌రువు త‌గ్గడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి…?

మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం వల్ల ఇరిటేషన్‌ పెరుగుతుంది. చికాకు పడుతుంటారు. కొంతమందిలో డిప్రెషన్‌కు లోనవుతారు. తరచూ వేదనకు గురవుతారు. భయపడుతూ ఉండటం కూడా కనిపిస్తుంటుంది. అసంతృప్తికి లోనవుతుంటారు. మతిమరుపు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఏకాగ్రత తగ్గుతున్నట్లుగా అనిపించవచ్చు. ఒక్కోసారి డిస్టర్బ్‌గా కనిపిస్తారు. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించినా అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. మెనోపాజ్‌ దశలో బరువు పెరగటం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయట పడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇది శరీరంలోని రసాయనాల అసమతుల్యత వలన తలెత్తుతున్నట్లు గుర్తించాలి. శారీరక వ్యాయామం , నడక వంటివి చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. యోగా, మెడిటేషన్‌ వంటివి ఎంతో ఉప‌యుక్తంగా ఉంటాయి. త‌గినంత విశ్రాంతి తీసుకొవాలి. ఎక్కువ స‌మ‌యం నిద్ర‌లో గ‌డిపేట్టుగా చూసుకోవాలి. స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌గానే డీలా ప‌డిపోకుండా మాన‌సికంగా దృఢ‌త్వాన్ని అల‌వ‌ర్చుకోవాలి. స‌మ‌స్య‌ల్ని త‌ట్టుకునేలా మెద‌డును స‌న్న‌ద్ధం చేయాలి. మాంసాల్లోని శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌, పూర్తి కొవ్వు ఉండే డెయిరీ పదార్థాలు, ఇతర జంతు సంబంధిత ఉత్పత్తుల్ని తిన‌డం తగ్గించాలి. మానసికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటే సైకాలజిస్టును సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకోవాలి.

మెనోపాజ్ లో బరువు తగ్గించుకోవడాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?

చాలామంది మ‌హిళ‌లు మెనోపాజ్ లో ఒత్తిడి, డిప్రెష‌న్‌ని ఫేస్ చేస్తారు. దీనివ‌ల్ల ఎక్కువ‌గా తింటారు. కాబ‌ట్టి.. నిపుణుల స‌ల‌హాతో.. ఒత్తిడి త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. 30 ఏళ్ల‌లో శ‌రీరం ఎలా ఉంటుందో.. మెనోపాజ్ లో కూడా అలానే ఉండ‌దు. కాబ‌ట్టి.. ఆల్క‌హాల్ ని త‌గ్గించాలి. ఎక్కువ‌గా ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డానికి అవ‌కాశాలు ఉంటాయి. ఇవి.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయి. యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు చేసే వ్యాయామాల‌నే వ‌య‌సు పెరిగిన త‌ర్వాత కూడా చేయ‌డం మంచి అల‌వాటు కాదు. మెనోపాజ్ త‌ర్వాత‌.. ప్ర‌త్యేక‌మైన వ్యాయామాలు అవ‌స‌రం. కాబ‌ట్టి.. నిపుణుల స‌ల‌హా ప్ర‌కారం వ్యాయామం చేయ‌డం అవ‌స‌రం. ఎంత వీలైతే అంత న‌డ‌వ‌డం మంచిది. లిఫ్ట్ ల‌కు బదులు స్టెప్స్ ఉప‌యోగించ‌డం మంచిది. స‌రుకుల కోసం వెళ్లిన‌ప్పుడు న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు కంట్రోల్ లో ఉంటుంది. ఈ అల‌వాటు మెట‌బాలిజంను స‌జావుగా ఉంచ‌డ‌మే కాకుండా.. బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఫిష్ లేదా ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ ని వ‌య‌సు అయిన మ‌హిళ‌లు వాడ‌టం వ‌ల్ల‌.. హెల్తీ వెయిట్ మెంటెయిన్ చేయ‌వ‌చ్చు. ఫిష్ లో ఉండే విట‌మిన్ ఈ ఎక్కువ ఫ్యాట్ ని క‌రిగించి.. హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.

Leave a Comment