HEALTH TIPS : గురక పెడుతున్నారా అయితే మీకు.. ఈ సమస్యలు రావొచ్చు జాగ్రత్త

By manavaradhi.com

Published on:

Follow Us

నిద్రపోతున్నప్పుడు కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇలా ఒక్కసారి కాదు చాలా సార్లు జరుగుతుంది. శ్వాసలో ఇలా వచ్చే ఆటంకాన్నే స్లీప్‌అప్నియా అంటారు. దీని కారణంగా మెదడులో ఆక్సిజన్‌నిల్వ పడిపోతుంది. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. దానివల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండలేరు. ఈ స్లీప్‌ ఆప్నియా సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఇబ్బంది పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

చాలా మందికి తమకీ సమస్య ఉన్నట్లు తెలియదు. దాంతో నిద్ర మధ్యలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోయి, మళ్లీ మామూలైపోతుంది. పగటి పూట ఎక్కువగా నిద్రించడం, పెద్దగా గురక పెట్టడం, శ్వాస తీసుకోవడం కష్టమై హఠాత్తుగా మెలకువ రావడం, ఉదయం లేవగానే తలనొప్పి అనిపించడం, ఏ విషయంపైనా మనసు లగ్నం చేయలేకపోవడం, డిప్రెషన్‌ లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

స్లీప్‌ ఆప్నియా లో ముక్కు లేదా నోరు లేదా గొంతు గాలిగొట్టాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వారికి గౌట్ వ్యాధి కూడా దారితీయవచ్చు. స్లీప్ అప్నియా ద్వారా కలుపబడిన ఆమ్లజని యొక్క తక్కువ స్థాయి స్థాయిలు యూరిక్ యాసిడ్ అధిక ఉత్పత్తికి కారణమవుతాయి. ఇది గౌట్ రావడానికి ప్రధాన కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

స్లీప్ అప్నియా రోగ నిర్ధారణ తర్వాత రెండేళ్ళలో పెరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. స్లీప్‌ ఆప్నియా గురైతే శరీరానికి అందే ఆక్సిజన్‌ పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా కొన్ని దీర్ఘకాల రుగ్మతలు దాడి చేస్తాయి. ముఖ్యంగా గౌట్ వ్యాధి రావడానికి యాభైశాతం అవకాశాలు ఉన్నాయి. గౌట్ అనేది కీళ్లలో వాపును కలిగించే కీళ్లనొప్పులు. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ వ్యాధి సంభవిస్తుంది. ఈ యాసిడ్ కీళ్ళ మధ్యలో సూది వంటి స్పటికాలను ఏర్పరుస్తుంది, తద్వారా ఆ ప్రాంతం ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పి మరియు కీళ్ళవాపులకు కారణమవుతుంది. ఈ గౌట్ వ్యాధి ఎక్కువగా కాలి పెద్ద బొటనవేలు దగ్గర సంభవిస్తుంది. అలాగే చేతివేళ్ళు, మణికట్టు, మోకాళ్లలో కూడా సంభవించవచ్చు.

స్లీప్‌ ఆప్నియాలో భాగంగా శరీరంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణం పెరగటం వల్ల కొన్ని రకాల రుగ్మతలు బాధిస్తాయి. “స్లీప్ అప్నియా ఉన్నవారు స్వల్ప మరియు దీర్ఘకాల రెండింటిలోనూ గౌట్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఈ ప్రమాదం సామాన్య శరీర ద్రవ్యరాశి ఇండెక్స్ ఉన్న వ్యక్తులలో అత్యధికం కాబట్టి, వైద్యులు మరియు ఇతర ఆరోగ్య నిపుణులు స్లీప్ అప్నియాతో ఉన్న రోగులలో గౌట్ రావడానికి అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా కాలి బొటనవేలితో మొదలై తర్వాత మిగతా కీళ్లకు వ్యాపించే గౌట్ వ్యాధి సరైన సమయంలో గుర్తించాలి. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. గౌట్ కు చికిత్స చేయనంత వరకు సమస్య మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇది కీళ్లను, ఇతర కణజాలాలకు హాని కలిగిస్తుంది.

సాధారణంగా గౌట్ వల్ల కీళ్ల నొప్పులు తరచుగా రావడం, తగ్గడం వల్ల జాయింట్ విరుగుతుంది. మొదట్లో ఒక జాయింట్ తో మొదలై తరచూ ఆటాక్స్ వస్తున్నప్పుడు ఇతర జాయింట్స్ కు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం యూరిక్ ఆమ్లము కీళ్లలో ఉంటే కీళ్లకు హాని ఏర్పడుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారిలో ఈ గౌట్ సమస్య ఎక్కువగా ఉంటుంది.

స్లీప్ అప్నీయా ఉన్నవారి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గియాలి అంటే ఆక్సిజన్ లెవల్స్ మంచిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు గౌట్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. స్లీప్ అప్నియాను CPAP – చికిత్సతో ద్వారా తక్కువ ఆక్సిజన్ స్థాయిలను సరిచేసి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చు, ఇది గౌట్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గింస్తుంది. గౌట్ ను హై రెసోల్యూషన్ అల్ట్రా సౌండ్ అనే స్కానింగ్ ద్వారా కూడా నిర్ధారించవచ్చు. దీనికి ప్రత్యేకంగా సిటీ స్కాన్ ద్వారా కూడా నిర్ధారించవచ్చు. దీనికి జీవితాంతం చికిత్స ఉంటుంది.

రోగి సడన్ గా నొప్పి, వాపుతో ఆసుపత్రికి వచ్చినపుడు వెంటనే యూరిక్ ఆసిడ్ తగ్గించే మందులు వాడకూడదు. దీనివల్ల సమస్య మరింతగా రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటగా నొప్పి నివారణ మందులు వాడాలి. అలాగే గౌట్ కారణమయే స్లీప్ ఆప్నియా సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రోజూ ఒకే వేళకు నిద్రపోవాలి. ఎక్కువ మసాలాతో కూడిన ఆహారాలు తీసుకోకూడదు. పగటి నిద్ర మానుకోవాలి. నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ధూమపానం, మద్యపానం అలావాట్లుకు దూరంగా ఉండాలి.

స్లీప్‌ ఆప్నియా చాలా ప్రమాదకరమైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. స్లీప్‌ ఆప్నియా తేలికగా తీసుకోవద్దు. కాబట్టి దీని లక్షణాలు కనిపించింన వెంటనే అలసత్వం వహించకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్సను తీసుకోండి. తద్వారా స్లీప్‌ ఆప్నియా వల్ల వచ్చే ఇతర అనారోగ్యసమస్యల నుంచి బయటపడవచ్చు.

Leave a Comment