ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ఫిట్’గా ఉండాలి అనుకుంటారు. బరువు తగ్గే విషయంలో మనకు సహాయపడే గాడ్జెట్లు కూడా ఉన్నాయి. అవే స్మార్ట్ వాచ్లు.
అధిక బరువు బరువు తగ్గించుకొవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయామాలను చేయటం లేదా ఆహార ప్రణాలికలను పాటించటం. సరైన బరువు కలిగి ఉండడమే ఆరోగ్యానికి మూల సూత్రం. ఆరోగ్యకరమైన బరువు అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఎక్కువ మందిలో బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా వారి బరువు ఆరోగ్యకరమైనదా, కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సరైన BMI కలిగి
ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు… వ్యాయామం చేయడం చాలా అవసరం.
చాలా మంది తెగ కష్టపడి వ్యాయామాలు చేస్తుంటారు. దీని వల్ల బరువు తగ్గడం ఏమోగానీ కానీ బలహీనంగా తయారవుతున్న వాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం. స్మార్ట్ వాచ్ వాడకం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు మణికట్టుపై ఓ మినీ కంప్యూటర్ నే మోస్తూ ఆనందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ పలు యాప్స్ ను యాక్సెస్ చేయడం మాత్రమే కాకుండా మీ హృందయ స్పందన రేటును, ఫిట్ నెస్ వివరాలు లాంటి ఇతర ముఖ్యమైన సంకేతాలను కూడా సూచిస్తుంది.
స్మార్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వవచ్చు…?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఇన్‌యాక్టివిటీ అలర్ట్‌లు, అలారం సెట్టింగ్‌లు, స్టెప్స్ కౌంట్ వంటి ఫీచర్‌లు సెట్ రొటీన్‌ను అనుసరించేలా ప్రోత్సహిస్తాయి. అదనంగా ఈ యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్‌లు ధరించేవారిని.. వారి రోజువారీ లక్ష్యాలను చేరుకోవడానికి పుష్ చేస్తాయి. స్మార్ట్‌వాచ్‌లు ఈ లక్షణాన్ని సంపూర్ణంగా ప్రభావితం చేస్తాయి. పరికరం ధరించిన వారి శారీరక దృఢత్వాన్ని వారి రోజువారీ లక్ష్యాల గురించి క్రమం తప్పకుండా గుర్తుచేస్తూ, వాటిని సాధించిన తర్వాత వారి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడం వీటి నైజం.
ఫిట్‌నెస్ లక్ష్యాన్ని నిర్దేశించడంలో దానిని సాధించడంలో స్మార్ట్‌వాచ్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫిట్‌నెస్ లక్ష్యాలను పర్యవేక్షించడం, ట్రాక్ చేయడం మరియు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్మార్ట్‌వాచ్‌లు వినియోగదారులకు శ్రమతో కూడుకున్న, సంక్లిష్టమైన క్యాలరీ-కౌంటింగ్ టెక్నిక్‌లను ఆశ్రయించకుండా సహాయపడతాయి.
స్మార్ట్ వాచ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి..?
ఫిట్‌నెస్ పరికరం నుండి పొందే డేటాను మాత్రమే కాకుండా.. . S.M.A.R.Tని ఆకృతి చేయడానికి మీరు ట్రాక్ చేసే సమాచారం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి, తిన్న ఆహారం మరియు నిద్రపోయే సమయాలను ఉపయోగించండి. దీన్ని ఎలా చేయాలో అంటే… వ్యాయామం చేయడం ద్వారా మీరు వారానికి ఎన్ని కేలరీలు బర్న్ చేస్తున్నారో ఫిట్‌నెస్ పరికరాన్ని చూడండి. కేలరీల బర్న్‌ను పెంచడానికి ఆ డేటాను ఉపయోగించండి. ఉదాహరణకు, ఒక S.M.A.R.T. లక్ష్యం “నేను ఈ వారం వ్యాయామం ద్వారా కనీసం 1,250 కేలరీలు బర్న్ చేసేంతగా నడుస్తాను అని సెట్ చేసుకోండి. మీరు బర్న్ చేసే కేలరీలను ట్రాక్ చేస్తుంది, కాబట్టి మీరు ఎప్పుడు విజయం సాధించారో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు.
వ్యాయామం ద్వారా వారానికి 1,000 కేలరీలు బర్న్ చేస్తున్నారు కాబట్టి, దాన్ని కొంచెం పెంచడం ద్వారా నిర్వహించవచ్చు. 1,250 కేలరీలు బర్న్ చేయడానికి, మీరు ఒక అదనపు వ్యాయామాన్ని జోడించాలి. వ్యాయామం బరువు తగ్గడానికి పూర్తిగా సంబంధించినది! కాబట్టి ఎక్కువ వ్యాయామం చేయడం మీ బరువు తగ్గించే ప్రణాళికకు సరిపోతుంది.
స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడంలో సాధనంగా సహాయపడగలవని గుర్తుంచుకోవడం ఉత్తమం. మిమ్మల్ని మీరు ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ వాచ్లు ఉపయోగించుకోవాలి. మీరు ఏదైనా అసాధారణ సంకేతాలను చూసినట్లయితే వెంటనే మీ వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.