మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మెదడుకు రక్తప్రసరణ నిలకడగా ఉంటే దాని పనితీరు బాగుంటుంది. లేకపోతే అది మనమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మిగిలిన అవయవాలకు జరిగినట్లే మెదడుకూ నిరంతరం రక్తప్రసరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మెదడుకు రక్తాన్ని, పోషక పదార్థాలను సరఫరా చేసే రక్తనాళాలు హఠాత్తుగా మూసుకుపోతాయి. దీన్నే స్ట్రోక్ అంటారు. దీనివల్ల మెదడులోని ఆ భాగంలోని కణాలకు ప్రాణవాయువు అందక పోవటంతో అవి దెబ్బతినటం లేదా చనిపోవటం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో మెదడులోని ఏ ప్రాంతాన్ని నియంత్రిస్తుందో శరీరంలోని ఆ భాగం వైకల్యానికి గురౌతుంది. దీనివల్ల మాట పడిపోవడం, జ్ఞాపకశక్తి, కదలిక కోల్పోవడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ మెదడులో ఏ భాగానికి ప్రభావితమైంది, మెదడు ఎంత దెబ్బతిన్నది అనేదానిపై ఆధారపడి రోగిపై ప్రభావం చూపుతుంది.
స్ట్రోక్ ను ముందస్తుగా ఎలా గుర్తించాలి ?
- మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనిలో క్లాట్ ఉంటే ఆ బ్లాక్స్ రక్త ప్రసారాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. రెండవ కారణం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని దెబ్బతింటే దానివల్ల అధిక రక్తపోటు వస్తుంది. దీనిని హెమరెజిక్ స్ట్రోక్ అంటారు. ఇది కూడా మెదడు ప్రాంతంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ ఆటంకం కలిగినా, ఆగి పోయినా, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభమై, దానివల్ల మెదడు దెబ్బతింటుంది. స్ట్రోక్ చిన్నదే అయితే, దానివల్ల మోచేయి లేదా కాలు కొద్దిగా నీరసిస్తాయి. కానీ అదే పెద్ద స్ట్రోక్ అయితే రోగికి ఒక వైపు భాగమంతా పనిచేయక పోవడం, మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.
- అదృష్టవశాత్తూ, కొంతమందికి, స్ట్రోక్ తరువాత కొన్ని కణాలు కోలుకుని కొన్ని గంటలు లేదా నిమిషాల్లో తిరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. దీనిని కూడా మినీ స్ట్రోక్ అంటారు. ఇది తాత్కాలికమైన బ్లాకేజ్ ..దీనివల్ల పూర్తిగా మెదడు దేబ్బతినదు, కానీ స్ట్రోక్ హెచ్చరికా చిహ్నాలు కొన్ని నిముషాలు లేదా గంటలలోనే తెలుసుకోవచ్చు, ఈ హెచ్చరిక చిహ్నాల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాటిని వదిలేయకూడదు. స్ట్రోక్ చిహ్నాలను ముందుగానే తెలుసుకోవాలి, అలాంటి చిహ్నాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా స్ట్రోక్ కి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. తీసుకునే ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. కొవ్వును కలిగించే వాటికి దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. బీఎంఐ అదుపు తప్పుతుందంటే, స్ట్రోక్ కు దగ్గరవుతున్నట్టే. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రజర్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి.
బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలి. ఈ రెండూ స్ట్రోక్ ను శరవేగంగా దగ్గర చేస్తాయి. శరీరానికి చాలినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఇందుకోసం అలసట తీరేంతగా నిద్ర పోతే సరిపోతుంది.ఇలా అలవాట్లను మార్చుకోవడం, దురలవాట్లకు దూరం కావడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉంటే స్ట్రోక్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
స్ట్రోక్ రావడానిక ముఖ్యకారణం మన జీవనశైలిలో మార్పులు రావడమే అని గుర్తించాలి. మద్యపానం మరియు పొగ తాగే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. అలాగే రోజూ సమతుల ఆహారం తీసుకుంటూ .. వాకింగ్, వ్యాయామం లాంటి చేస్తే స్ట్రోక్ లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యంతంగా జీవించవచ్చు.