Health tips : ఫాస్ట్ ఫుడ్స్ ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా హానికరం

By manavaradhi.com

Published on:

Follow Us
Trans Fats

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మనం తీసుకునే ఆహారం బాగుండాలి. మనం హాని చేసి ఆహరం తీసుకుంటే నిజంగా మన ఆరోగ్యంపై అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా హానికరం. గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర వ్యాధులకు ట్రాన్స్ ఫ్యాట్స్ ఒక ముఖ్య కారణం.

జంక్‌ఫుడ్‌ వీటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్ అంటే.. వంట నూనెల‌ను బాగా వేడి చేయ‌డం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. ఇక వ‌న‌స్ప‌తి నూనెల్లో స‌హ‌జంగానే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సాధార‌ణంగా ఫ్యాట్స్ రెండు ర‌కాలు. శాచురేటెడ్‌, అన్‌శాచురేటెడ్ అని. ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ అన్‌శాచురేటెడ్ కింద‌కు వ‌స్తాయి. కానీ మిగిలిన అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ క‌న్నా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ప్రమాద‌క‌రం. వంట నూనెల‌ను హైడ్రోజ‌నీక‌ర‌ణం చేసిన‌ప్పుడు ఆ నూనెల్లో ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్ప‌డ‌తాయి.

వంట నూనెల‌తో త‌యారు చేసే ప‌దార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండ‌డానికి, అవి మంచి వాస‌న రావ‌డానికి, నూనెల‌ను ఎన్ని సార్లు వేడి చేసి అయినా ఉప‌యోగించుకునేందుకు వీలుగా వాటిని ప‌రిశ్ర‌మల్లో హైడ్రోజ‌నీక‌ర‌ణం చెందిస్తారు. అప్పుడు ఆ నూనెల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్ప‌డ‌తాయి.

కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్, బిస్కెట్లు, శాండ్‌విచ్‌, చాక్లెట్స్, వేఫర్స్‌, మైక్రోవేవ్‌ పాప్‌కార్న్‌, పిజ్జా, ఐస్‌క్రీమ్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్, ఫ్రైడ్‌ చికెన్‌ , రెడీ టు ఈట్‌ ఆహార పదార్థాలలో ఇవి ఉంటాయి. నాలుకకు రుచిక‌రంగా అనిపించే ఎన్నో చిరుతిళ్లు ప్ర‌స్తుతం మ‌నకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ నిజానికి మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావ‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. ఎందుకంటే.. ఈ ఆహారాల్లో కొవ్వు ప‌దార్థాలు బాగా ఉంటాయి. అందువ‌ల్ల వీటితో మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని కూడా వైద్యులు చెబుతుంటారు.

జంక్‌ఫుడ్‌ల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులే కాదు, ఒబెసిటీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

processed foods
processed foods

ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. అదే విధంగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉండడం అసలు మంచిది కాదు. ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ని తీసుకు రావడానికి కూడా ట్రాన్స్ ఫ్యాట్ దారితీస్తుంది. అలానే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా పెంచుతుంది. దీని కారణంగా హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోతాయి. ముఖ్యంగా స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్‌కి దూరంగా ఉండండి.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.

సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయంటే చెప్పలేనన్ని అనారోగ్య సమస్యలు వచ్చిపడుతుంటాయి. అందుకే చాలా మంది డైట్ ను ఫాలో అవుతుంటారు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హని కలిగిస్తే, మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను పెంచె ఆహారాలకు దూరంగా ఉందాం… ఆరోగ్యంగా జీవిద్దాం..

Leave a Comment