Depression:డిప్రెషన్.. భయపడద్దు.. ఇలా బయటపడండి.

By manavaradhi.com

Published on:

Follow Us
ways to ease Depression

డిప్రెషన్‌ ఈ మధ్యకాలంలో తరచూ అందరిదగ్గర మనకి వినిపిస్తున్న మాట ఇది. ఈ డిప్రెషన్‌ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే కుమిలి పోయే, ఒకలాంటి అయోమయ స్థితికి తీసుకువెళుతుంది. ఏ వయసువారినైనా ఈ డిప్రెషన్‌ చుట్టుముట్టచ్చు.

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఎవరినీ చూసినా నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇది కేవలం మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.ఒకే దగ్గర కూర్చుని రోజంతా పని చేయడం వల్ల మనకు తెలీకుండానే ఒత్తిడీ, ఆందోళన గురౌతున్నాం. డిప్రెష‌న్ ఒక మాన‌సిక రుగ్మ‌త‌. మ‌హిళ‌లు.. పురుషులు, చిన్నా.. పెద్దా ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవ‌రికైనా ఇది రావొచ్చు.పెంపుడు జంతువుల యజమానులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పెంపుడు జంతువులతో సాన్నిహిత్యం ఒంటరితనాన్ని తగ్గించడమే కాక, మానసిక స్థితికి సాంఘిక మద్దతును పెంచుతుంది.

ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయని పరిశోధనల్లో తేలింది. పుష్కలంగా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాల గల భోజనం మరియు స్నాక్స్‌ను రూపొందించండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పోషకం ఎక్కువగా లభించే సాల్మన్, ట్రౌట్, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

విటమిన్ B12, ఇతర B విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తూ, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. ముస్సెల్, క్లామ్స్, ఆయిస్టర్స్ వంటి షెల్ ఫుడ్స్‌ నుంచి విటమిన్ బి12 శరీరానికి అందుతుంది. ఇతర మాంసాహారంలో కాలేయం ఈ పోషకానికి వనరుగా ఉంటుంది. సీఫుడ్ మంచి B12 మూలం, కానీ శాఖాహారులు దానిని బలవర్థకమైన తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు మరియు సప్లిమెంట్లలో పొందవచ్చు.

మెదడు పనితీరుపై ప్రభావం చూపే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. సెరోటోనిన్ సంతోషం, వెల్‌బీయింగ్‌కు కారణమవుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యలను దూరంచేసి, శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభించేలా చేస్తుంది. ఎక్కువ కెఫిన్ మిమ్మల్ని భయాందోళనలకు గురి చేస్తుంది, చికాకు కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు కెఫీన్ మరియు డిప్రెషన్ మధ్య స్పష్టమైన సంబంధాన్ని కనుగొనలేకపోయినప్పటికీ, దానిని తగ్గించడం వలన మీ పరిస్థితిని కలిగి ఉండేఅవకాశాలను తగ్గించి, మీ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

నొప్పులతో బాధపడినప్పుడు, మంచి మానసిక స్థితిలో ఉండటం కష్టం. అందుకని ముందు వాటికి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. వ్యాయామం కొంతమందికి యాంటిడిప్రెసెంట్‌ల వలె దాదాపుగా పనిచేస్తుంది. ప్రతి రోజూ వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువుతోపాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాలి నడక కూడా డిప్రెషన్ నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. సాయంత్రం పూట లేదా ఉదయం పూట కొంత దూరం కాలి నడకన నడవడం మానసికంగా,శారీరకంగా చాలా మంచిది. చలికాలంలో మరింత నిరాశకు గురవుతున్నారా? మీకు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) ఉండవచ్చు. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఇది సర్వసాధారణం. లైట్ థెరపీ, యాంటిడిప్రెసెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ మరియు టాక్ థెరపీతో SADకి చికిత్స.

కొంతమందికి వంట చేయడమంటే ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం.. కొందరికి మంచి మెలోడీ సాంగ్స్ వినడం ఇష్టం.. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలా మనసుకు నచ్చిన విషయాలపై దృష్టి పెట్టాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ సన్నిహితులతో మాట్లాడండి. మీ మనసులోని భావాలను వారితో పంచుకోండి. కుటుంబ సభ్యుల, స్నేహితుల నెట్‌వర్క్‌ డిప్రెషన్‌ బాధితులకు ఎంతో తోడ్పడుతుంది. తాము ఒంటరిగాలేమనే భరోసా ఇస్తుంది. ఒక రోజు పిక్నిక్ లేదా రెండు మూడు రోజుల విహార యాత్ర వంటి వాటికి హాజరు కావటం, తరుచు పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, మీకు ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒంటరిగే గడిపేవారికి గార్డెనింగ్, పెట్స్ ను పెంచుకోవడంతో పాటు పుస్తకాలు మంచి నేస్తాలు. అవి మీ మనస్సును ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి ఫ్రెండ్ ని కలిసిన అనుభూతి కలుగుతుంది. మెడిటేషన్, యోగా చేస్తే మెదడు రిలాక్స్ అవుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అప్పటికప్పుడు ఏదైనా ముఖ్యమైన పనిని తలపెడితే ఒత్తిడి ఖాయం. అందుకే ముఖ్యమైన పనులకు ముందుగానే ప్లాన్ చేసుకుని పూర్తి చేయండి. మద్యపానం మానాలి. మద్యపానం వల్ల డిప్రెషన్‌ లక్షణాలు ఇంకా తీవ్రంగా మారతాయి. తీసుకునే మందులు సరిగ్గా పనిచేయవు.

మానసిక ఒత్తిడి మనిషిని చిత్తు చేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చిన్న‌చిన్న విష‌యాల‌కే చిరాకు ప‌డ‌టం,స‌హ‌నం కోల్పోవ‌డం,శారీర‌క ప‌ర‌మైన ఈ ల‌క్ష‌ణాలు సాధార‌ణంగా చాలా మందిలో క‌నిపిస్తాయి. అయితే ఇవి దీర్ఘ‌‌కాలం ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. మాన‌సిక నిపుణులైతే ఇంకా మంచిది.

Leave a Comment