బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF 2025 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ అండ్ నాన్-మినిస్టీరియల్ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 549 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుషులు, మహిళ క్రీడాకారులు ఆన్‌లైన్ ద్వారా జనవరి 15 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. భారతదేశపు ప్రధాన సరిహద్దు గార్డింగ్ ఫోర్స్‌లో చేరడానికి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది ఒక గొప్ప అవకాశం.
పోస్టుల వివరాలు: ఖాళీలు
- స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): మొత్తం ఖాళీలు 549
(పురుషులు: 277, మహిళలు: 272 )
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితరాలు.
అర్హతలు: అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (టెన్త్) లేదా తత్సమాన విద్యార్హతతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులు అయి ఉండాలి. గత రెండు సంవత్సరాల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు లేదా పాల్గొన్న వారు అర్హులు.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: నెలకు రూ.21,700- రూ.69,100.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), మెరిట్ లిస్ట్ (స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా), ధ్రువపత్రాల పరిశీల, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ఓబీసీ/ఓబీసీ (పురుషులు): రూ.159. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభం: 27.12.2025.
దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026.









