భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాలలో ‘అసిస్టెంట్’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 650 పోస్టులను వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో భర్తీ చేయనుంది. ముఖ్యంగా ముంబయి-249, చెన్నై-53, కాన్పూర్ & లఖ్‌నవూ-50, ఢిల్లీ-49, హైదరాబాద్-11 తదితర కార్యాలయాల్లో ఖాళీలున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగనుంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు మార్చి 8వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది). దీనితో పాటు కంప్యూటర్ (వర్డ్ ప్రాసెసింగ్) పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర కార్యాలయానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 01.02.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.58,514(+అలవెన్సులు)
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ఆబ్జెక్టివ్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్: రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ పై పరీక్ష ఉంటుంది.
భాషా నైపుణ్య పరీక్ష (LPT): మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.50+ జీఎస్టీ (కేవలం ఇంటిమేషన్ ఛార్జీలు). జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450+జీఎస్‌టీ (అప్లికేషన్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.02.2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2026.
ప్రిలిమినరీ పరీక్ష (తాత్కాలిక): 11.04.2026.
మెయిన్ పరీక్ష (తాత్కాలిక): 07.06.2026.









