ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో చాలామంది కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏ పనీ చేయరు. అదే కొనసాగితే బద్ధకం వచ్చేసి రోజంతా అదే కొనసాగుతుంది. ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలంటే నిద్ర లేవగానే కొన్ని పనులు చేయాలంటున్నారు వైద్యనిపుణులు. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి.
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్ చెక్ చేయకండి. ఇవి కొన్ని సందర్భాల్లో మీ మూడ్‌ని పాడుచేస్తాయి. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
రిలాక్సేషన్ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా మంచినీళ్లు తాగితే మంచిది. ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ సంగీతం వినడం మంచిది. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.
ఉదయం నిద్రలేచిన తరువాత వీలైనంత త్వరగా స్నానం చేయాలి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతస్థాయులను సమన్వయం చేస్తుంది. మెదడును ఉత్సాహపరిచి, చురుగ్గా మారుస్తుంది. శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. గోరువెచ్చని నీటిని ఎంచుకుంటే మరీ మంచిది. ఇదో వ్యాయామంలా పని చేస్తుంది. చాలామంది మహిళలు ఉదయం అల్పాహారం తీసుకోరు. సమయం లేదని చెబుతారు. కానీ తప్పనిసరిగా తినాలి. దీనివల్ల కూడా శరీరం రోజంతా చురుగ్గా మారుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
నిద్రలేచిన వెంటనే ఫోను చూసుకునే అలవాటు ఉంటే మానేయాలి. ఫోను చూస్తూ అలా కూర్చుండిపోతాం. దాంతో తెలియకుండానే సమయం వృథా అయి. గంటలు గడిచేకొద్దీ ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు. ఇదే సూత్రం టీవీకి వర్తిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అవసరం అనుకుంటేనే ఫోను లేదా టీవీ చూడాలి. దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర కూడా కీలకమే. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి. పొద్దున్నే కనీసం అరగంటసేపు వ్యాయామం చేయడం వల్ల కూడా బద్ధకం, నిస్తేజం వదిలి శరీరం ఉత్సాహంగా మారుతుంది.
ఉదయం లేవగానే చేతులను..మెడను..కాళ్లు..చేతులను అటూ ఇటూ కదుపుతూ చిన్న పాటి వ్యాయామాలు చేయండి. ఇలా బెడ్ పై కూడా చేయవచ్చు. ఉదయాన్నే తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. కనీసం 8గంటల పాటు పడుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ కూడా పడుకోవద్దు. ఉదయం లేవగానే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.ఇక రాత్రి పడుకొనే సమయంలో నిద్ర రాకపోతే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.