పెరుగుతున్న బిజీ జీవితంలో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. ఆ సమయంలో మనం పనులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్షణ శక్తిని పొంది… శక్తి స్థాయులను పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

మనలో చాలా మందికి మధ్యాహ్నానికి పని చేసే స్థాయి తగ్గిపోతుంది. అలాటప్పుడు శక్తినిచ్చే పానీయాల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. ఇవి అప్పటికప్పుడు కాస్త బలాన్ని ఇచ్చినట్లు కనిపించినా, ఆ తర్వాత మీ శక్తిని పూర్తిగా హరిస్తాయి. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో రీప్రెష్ కావడానికి మన రోజు వారి అలవాట్లలో చిన్న పాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వీటి వల్ల అలసటగా ఉన్నామనే భావన పూర్తిగా వదిలేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా చేయవలసింది రోజూ ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకోవడమే. చాలా మంది ఒత్తిడితో అల్పాహారాన్ని తినరు. దీని వల్ల త్వరగా ఆలసిపోవడానికి ఆస్కారం ఉంది. ఓట్ మీల్ లేదా అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆకలిగా ఉండే వారు త్వరగా శక్తిని కోల్పోతారు. ఉదయాన్నే అల్పాహారం విషయంలో రాజీ పడకపోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే సూర్య రశ్మిలో కాసేపు గడపడం వల్ల రోజు మొత్తానికి కావలసిన శక్తి అందుతుంది. రోజూ ఉదయాన్నే సూర్య రశ్మిలో తిరగడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త సమాచారం గ్రహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందుకే వీలైనంత మేరకు రోజూ ఉదయాన్నే కాసేపు సూర్య రశ్మిలో గడపడం మేలు చేస్తుంది.
మనలో శక్తిని ఎలా పెంచుకోవాలి ?
మనం చేసే చిన్న పాటి వ్యాయామం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తక్షణ శక్తి అందుతుంది. కదిలే వ్యాయమం చేయడం ద్వారా వెంటనే శక్తిని పొందవచ్చు. దీని ద్వారా ఆక్సిజన్ అధికంగా గుండె, కండరాలు, మెదడులోకి చేరుతుంది. దీని వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మెగ్నీషియం మరియు ఫోలేట్ ఎక్కువగా ఉన్న వేరు శనగ పప్పు తినడం ద్వారా కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా కణాల వ్యవస్థలో సరైన విధంగా పోషకాలు లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వీటి వల్ల అలసిపోలేని పరిస్థితి ఎదురౌతుంది. దాల్చిన చెక్క, పుదీనా లాంటి వాటి వాసన కూడా ఆలసటకు వ్యతిరేకంగా ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పాటు పిప్పర్ మెంట్ వాసన కూడా మంచి శక్తిని అందిస్తుంది. వీటిలో ఏది దగ్గర ఉంచుకున్నా, తక్షణ శక్తిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. నీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవాలి. శరీరానికి కావలసిన స్థాయిలో నీరు తాగడం వల్ల ఒత్తిడి దరి చేరదు. దాహంతో బాధ పడేవారు వీలైనంత వరకూ ఎక్కువ నీటిని తీసుకోవాలి. సరైన స్థాయిలో నీరు త్రాగడం మంచి శక్తిని అందిస్తుంది.
తక్షణం శక్తిని పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
శరీరం ముందుకు నడవడానికి కాస్తం చక్కెర స్థాయి అవసరం. ఇవి తగ్గినప్పుడు మెదడు సరైన విధంగా పని చేయదు. అందుకే మధ్యాహ్నం కాస్తంత చిరుతిళ్ళను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ప్రొటీన్ మిళితం చేసిన స్నాక్స్ తీసుకోవడం, తాజా పండ్లు లాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చక్కగా ఉంటుంది. అలానే కాసేపు మిత్రులతో మాట్లాడ్డం కూడా శక్తిని అందిస్తుంది. కచ్చితంగా నిరంతరం మానవ సంబంధాలు కొనసాగించడం ఒత్తిడి నుంచి విముక్తి ఇస్తుంది. దీని వల్ల అలసిపోకుండా ఉంటారు. మన మానసిక పరిస్థితి ఏమిటనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన విధంగా అలసట లేని విధానాన్ని ఎంచుకోవాలి. అదే విధంగా కాస్త నీరసంగా అనిపించినప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం, ధ్యానం లాంటి చేయడం లేదా నిపుణుల సలహా మేరకు చిన్న పాటి యోగాసనాల ద్వారా కూడా తక్షణ శక్తిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల కూడా తక్షణం శక్తి లభిస్తుంది.