Blood Circulation : రక్త ప్రసరణ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

By manavaradhi.com

Published on:

Follow Us
  • మన శరీరానికి ఆయువు రక్తం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
  • రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అందిస్తుంది. హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.
  • రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . రక్తప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వొచ్చు .
  • శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది పెద్దవారిలో చాలా సాధారణం అయినా, ఏవయస్సు వారైనా ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం మంచిది.
  • రక్తనాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్, చేతులకు, కాళ్ళకు, మరియు శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన అలవాయాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ముఖ్యంగా ధూమపానం, వ్యాయామం, ఎక్కువ సమయం కూర్చోవడం, ఆహారపు అలవాట్లు మంచిగా లేకపోవడం, మరియు కొన్ని వైద్యపరిస్థితులు వంటి కొన్ని జీవనశైలిలోని మార్పులు మరియు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి ఈ సమస్యలను లోనయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ మరియు బరువు పెరగడం కూడా బలహీనమైన రక్తప్రసరణకు కారణం అవుతుంది.

సరైన రక్తప్రసరణ నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వాంఛనీయ స్థాయి నుండి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణం అవుతుంది. దాంతో ఫీవర్, చలి, జ్వరం, కాళ్ళు మరియు చేతులు చల్లబడటం జరుగుతుంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. దాంతో పాదాలు మరియు చేతులు వాపులకు కారణం అవుతుంది. దీన్నే ఓడీమా అని పిలుస్తారు . పాదాల్లో మరియు చేతుల్లో నీరు చేరుతుంది. దాంతో ఉబ్బుకొని ఉండటం వల్ల అసౌకర్యంగా మార్చుతుంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి . దాంతో అలసిపోయినట్లు అనుభూతి కలుగుతుంది . పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శ్వాస, గొంతు కండరాలు సలుబు మరియు రోజువారి కార్యకలాపాల్లో ఆసక్తి తగ్గుతుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే, రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి . రక్తప్రసరణ మెరుగ్గా లేనట్లైతే అలసటకు గురిచేస్తుంది. ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవల్సి వస్తుంది. శరీరం మొత్తం సరిగా రక్తప్రసరణ జరగకపోతే, జీవక్రియల్లో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతాయి. బలహీనమైన రక్త ప్రసరణ వల్ల శరీరంలో కొన్ని అవయవాలకు సరిగా రక్త ప్రసరణ జరగదు. అది జుట్టు, చర్మం, మరియు గోళ్లకు సరియైన విటమిన్స్ మరియు మినిరల్స్ అందక హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డ్రై స్కిన్, గోళ్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా రక్త ప్రసరణను సవ్యంగా ఉంచుకోవచ్చు. తక్కువ కొవ్వు పదార్ధాలు, తక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం, పీచు పదార్హాలు అధికంగా కలిగిన ఆహార పదార్ధాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు రక్త ప్రసరణ ని మెరుగుపరిచే సహజసిద్దమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యని నిర్మూలించవచ్చు. శ్వాస ని పీల్చడం లో చాలా మంది ఉపిరితిత్తుల సామర్ధ్యాన్ని ని పూర్తిగా ఉపయోగించుకోరు. మెరుగైన రక్త ప్రసరణ కోసం లోతైన శ్వాస ప్రక్రియను పద్దతులను పాటించాలి. తద్వారా ఉపిరితిత్తుల సామర్ధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ రక్త ప్రసరణ మెరుగుపరచుకొవచ్చు. రక్త ప్రసరణ లో సమస్యలకి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి కి గురైన వ్యక్తి లో రక్త ప్రసరణ కొన్ని ప్రధాన అవయవాల వద్దే నిలిచిపోతుంది. మిగతా భాగాలకు చేరదు. చేతులు మరియు కాళ్ళకి రక్త ప్రసరణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఒత్తిడిని అధిగమించాలి. లోతైన శ్వాస ప్రక్రియల ను పాటించడం మరియు ప్రతి రోజు ధ్యానం చెయ్యడం వంటి ద్వారా రక్త ప్రసరణ లో ఉన్న సమస్యలని అధిగమించవచ్చు.

Leave a Comment