పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తేనే ఎంతో బాధ పడిపోతుంటాం… మన చుట్టూ ఉన్న వారినడిగి వ్యాధికి సంబందించిన ఎన్నో సలహాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాం… మరి చిన్ని పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఎంతగానో భయపడిపోతుంటాం… అలాంటిది పిల్లలు మూత్ర సంబందిత సమస్యలతో భాదపడుతుంటే, మూత్రాన్ని ఆపుకోలేని సమస్య వారిని వేధించి, వారి తోటి పిల్లల ముందు, స్కూలులో వారిని సమస్య మానసికంగా భాదపట్టి అవమానికి గురి చేస్తే, అటు పిల్లలు ఎంతో భాదపడుతుంటారు.. ఇటు వారి తల్లితండ్రులు వారి సమస్యను చూసి భాదపడుతుంటారు.. మరి ఇలాంటి సమస్య రావడానికి గల కారణాలను గురించి తెలుసుకుందాం.
మన శరీరంలోని భాగమైన మూత్రపిండాల నిరంతరం పని చేస్తూనే ఉంటాయి.. రక్తంలోని వ్యర్థ పదార్ధాలను నిరంతరం వడగడుతూ మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతుంటాయి… ఇలాంటి వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే, అవి ఎలా స్పందిస్తాయో తెలుసుకుందాం.. చాలా మంది పిల్లలు మూత్ర విసర్జన సమస్యతో భాదపడుతుంటారు… నియంత్రణ లేకుండా, తెలియకుండా మూత్రం పడిపోవడాన్ని లేదా మూత్రం వస్తున్నపుడు, మూత్ర వసర్జన కు వళ్ళకుండానే మధ్యలోనే మూత్రం పడిపోవడాన్ని యూరినరీ ఇన్ కాంటినెన్స్ అంటారు.. ఇది జబ్బు కాదు… ఏదైనా వ్యాధికి సంబందించిన ఓక లక్షణం మాత్రమే… సాధారణంగా 3 సంIIలు నిండే సరికి పిల్లలు పక్క తడపడం మానేస్తారు.. ఒక వేళ మూత్రం వస్తే లేచి వెళ్ళి మూత్రం పోయడం అలవాటు చేసుకుంటారు.. అలా కాకుండా పిల్లలు 3 సంIIలు వయసు దాటిన తరువాత కూడా మూత్రాన్ని నియంత్రించుకోలేక, మధ్యలోనే పోస్తుంటారు.
ఇలాంటి సమస్యలు రావడానికి గల కారణాలు
- పిల్లలు జన్మించిన తరువాత, వారి శరీర భాగాలపై నియంత్రణ, అదుపు అనేది రావడానికవసరమైన ఆదేశాలన్నీ జన్యునిర్మాణంలో ఉంటాయి.. పిల్లల శరీరం పెరుగుతున్న కొద్దీ అభివృధ్ధ చెందుతాయి..ఇలాంటి నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉంటే పిల్లలలో ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి….
- మూత్ర కోశంపై పూర్తి అదుపు రావడం అనేది అందరి పిల్లలలో ఒకేరకంగా ఉండదు. 3 లేదా 4 సంIIలు వయస్సు తరువాతే జరుగుతుంది.. కాని, కొన్ని కారణాల వలన ఈ ముత్ర నియంత్రణ అనేది మరికొంత వయస్సు వచ్చే దాకా కూడా కొందరి పిల్లలలో రాదు.. మూత్ర కోశంలో మూత్రం పట్టే పరమాణం అందరిలో ఒకేలా ఉండదు… ఇలాంటి కారణాల వలన కూడా పిల్లలు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది…
- మూత్ర కోశం నియంత్రణలోకి రావడం ఆలస్యమైనా, లేగ మూర్ఛ వ్యాధి లాంటిది ఏమైనా ఉన్నా కూడా మూత్ర నియంత్రణ లేక పోవడం అనే సమస్యతో బాదపడవచ్చు…
- నరాల సంబందించిన వ్యాధులున్నా, వంశపారపర్యంగా చక్కెర వ్యాధి ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది…
- ఇంకా మానసిక వ్యాదులతో భాదపపడే పిల్లలలో కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంటుంది…
ఇలాంటి కారణాల వలన బాదపడుతున్న పిల్లల యొక్క మానసిక స్థితిని అర్దం చేసుకుని తల్లిదండ్రులు వారికి సహాయంగా ఉండాలి.
పెద్ద వారికి ఆరోగ్యసమస్యలు వస్తేనే మానసికంగా ఎంతో కృంగిపోతాం ఉంటాం.. కొన్ని సార్లు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా మనస్సులోనే బాదపడుతుంటాం… మరి పిల్లలు ఇలాంటి మూత్ర సంబంద సమస్యలతో భాదపడినపుడు, వారు ఎంతగా బాదపడతారు? ఎంత అవమానికి గురౌతారు? ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి… తోటి పిల్లల ముందు వారిని అవమానపరచకూడదు… ఎందుకంటే అది జన్యుపరంగా కొన్ని కారణాలలో వచ్చే సమస్య… పిల్లలు దానికి బాద్యులు కారు…అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి.. ఇలాంటి సమస్య పిల్లలలో వచ్చినపుడు, దానికి సంబందించిన లక్షణాలను కనుక పరిశీలించినట్లయితే….
- బాత్రుమ్ కి వెళ్ళే లోపే మూత్రం పడిపోతుంది..
- తరుచూ మూత్రానికి వెళ్ళాల్సిరావడం….
- తెలియకుండానే మూత్రాన్ని పోయడం..
- తుమ్మినా, దగ్గినా కూడా మూత్రం పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ఇలాంటి లక్షణాలు పిల్లలలో గమనించిన వెంటనే తల్లిదండ్రులు, వారి సమస్యను ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి… ఆ తరువాత ఈ సమస్యను సంబందించిన జాగ్రత్తలను ఎలా పాటించాలో తెలుసుకోవాలి.
పిల్లలలో మూత్ర సంబందిత సమస్యలు వచ్చినపుడు పెద్దగా బాదపడిపోయి. పిల్లలని బాదపెట్టడం, వారిని కొట్టడం, మాటలతో వారి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడం లాంటివి చేయకూడదు..ఎందుకంటే కొంత వయస్సు వచ్చే వరకి కొన్ని జాగ్రత్తలు, మెలకువలను పిల్లలకు మూత్ర విసర్జన సమయాలలో పాటించే దాకా అలవాటు చేస్తే….. పిల్లలలో మూత్రాన్ని నియంత్రించ లేక పోవడం అనే సమస్యనుండి దూరం చేయవచ్చు..
- గాల్ బ్లాడర్ కి సంబందించిన వ్యాయామాలను చేయడం పిల్లలకు నేర్పించడం వలన, మూత్రాశ కండరాలు బలోపేతం అయి మూత్ర విసర్జన అనేది నియంత్రణలోనికి వస్తుంది.
- రాత్రి సమయాలలో పిల్లలను మద్యలో లేపి మూత్రానికి వెళ్ళడం అలవాటు చేయడం
- మూత్ర విసర్జన గురించి వారికి గుర్తుచేయడం.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ…డాక్టర్ గారి దగ్గర సరియైనా చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుండి పిల్లలు క్రమంగా బయటపడవచ్చు.
సాధారణంగా పిల్లలలో మూత్రానికి సంబంధించిన సమస్యలు ఎదురైనపుడు, తల్లిదండ్రులు తగిన కారణాలు తెలుసుకుని వాటికి సంబంధించిన లక్షణాలను గమనించి వెంటనే వైద్యం చేయించాలి..