మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమతుల ఆహారాలు తీసుకున్నప్పుడే మంచి శక్తి లభిస్తుంది. కానీ రుచికరమైన ఆహారం దొరికితే .. ఎక్కవగా తినేందుకు ఇష్టపడతారు. ఇలా ఎక్కువగా ఆహారం తీసుకోవడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా స్థూలకాయం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీనంతటికీ కారణం అతిగా ఆహారం తీసుకోవడమే అవుతుంది. ఐతే దీన్ని నియంత్రిచుకోవడం అవసరం. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అతిసర్వత్రా వర్జయేత్.. అంటారు. అంటే అతి ఎప్పటికీ మంచిది కాదు అని అర్థం. ఇది భోజనం విషయంలోనూ వర్తిస్తుంది. అంటే ఎక్కువగా తింటే శరీరానికి మంచిది కాదని అర్థం. ఆహారం మితంగా తింటే ఆరోగ్యం … అతిగా తింటే విషం అని స్పష్టంగా చెప్పవచ్చు. స్థూలకాయం , అజీర్ణం సహా ఎన్నో సమస్యలను అతిగా తీసుకునే ఆహారం వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత మంది నచ్చిన ఆహారాలు మరీ ఎక్కవగా లాగించేస్తూ ఉంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. మరి దీన్ని నియంత్రించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు.
ఆహారం తీసుకోవడం కూడా గాబరగా తీసుకోకూడదు. వీలైనంత వరకు తక్కువగా నెమ్మదిగా తీసుకోవాలి. తినేందుకు సమయం పట్టడంతో ఆసక్తి తగ్గిపోతుంది. అంతే కాదు నెమ్మదిగా తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా తక్కువ తీసుకోవచ్చు.
అత్యంత రుచికరమైన ఆహారాలు డోపామైన్ వంటి రసాయనాలను మెదడు ప్రేరేపిస్తాయి. కొన్ని ఆహారాలు తినడం వల్ల మెదడు యొక్క రివార్డ్ మార్గంలో పెరిగిన డోపామైన్ ప్రసారంతో ఆనందాన్ని అనుభవించిన తర్వాత, వారు త్వరగా మళ్లీ తినాలని భావిస్తారు. పోషణ పరంగా చూస్తే అన్ని రకాల ఆహారాలు మంచివే. కానీ రుచి పరంగా చూసినప్పుడు మాత్రం కొన్నింటిని దూరంగా ఉంచడమే మంచింది. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది తీపి పదార్థాలు, ఉప్పు,కొవ్వు కలిగిన ఆహారాలు వంటివి వీలైనంత వరకూ తగ్గించుకోవాలి. చక్కెర, తీపి పదార్థాలు అతిగా తింటే బరువు పెరుగుతుందని తెలుసు. దంతక్షయం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందని తెలుసు. కానీ వీటితో మానసిక సమస్యల ముప్పూ పొంచి ఉంటోంది.
తీపి పదార్థాలు, తీపి పానీయాల ద్వారా రోజుకు 67 గ్రాముల కన్నా ఎక్కువ చక్కెరను తీసుకునే వారిలో దీర్ఘకాలంలో ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు తేలటతెల్లమైంది. నిజానికి తీపి పదార్థాలు తిన్నప్పుడు కొద్దిసేపటి వరకు హాయి భావన కలుగుతుంది. వీటి ప్రభావం తగ్గగానే తిరిగి మూడ్ మారిపోతుంటుంది. దీంతో మరింతగా తీపి పదార్థాలు తినటం మొదలెడుతుంటారని.. ఇది చివరికి మానసిక సమస్యలకూ దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి అదే విధంగా తీపి పదార్థాలు ఇష్టమైన వారు, అదే పనిగా పూర్తిగా వాటితోనే గడిపేయకూడదు. వాటిపై నియంత్రణ ఉంచితే మంచిది.
చాలామంది రుచిగా ఉందని ఎక్కువ ఆహారాలను తింటూ ఉంటారు. ఆహారంలో ఉప్పు, తీపి, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలకు బానిసలైపోతారు అది మంచి పద్దతి కాదు. మన శరీరానికి అవసరమైన మేర కొద్దిగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయో, శరీరానికి అవసరం అయ్యే లేదో చూసుకొని తినడం మంచిది.
మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇతర రకాల వ్యసనాల నుండి కోలుకోవడం కంటే ఆహార వ్యసనం నుండి కోలుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఉదాహరణకు, మద్యపానం చేసేవారు చివరికి మద్యం తాగడం మానేయవచ్చు. కానీ ఆహారానికి అలవాటు పడిన వ్యక్తులు ఇంకా తినాలి. దీని వల్ల వాటి మీద మీకు విరక్తి కలగవచ్చు. రోజు వారి ఆహారంలో అన్ని రుచులు ఉండడం తప్పని సరి అని గుర్తుంచుకోవాలి. ఒకటే దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు.
కొంతమంది తమకు నచ్చిన ఆహారాన్ని అధికంగా.. తీసుకుంటారు.. నచ్చని ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నా తినడానికి ఇష్టపడరు.. అటువంటి వారు తక్షణమే అలవాట్లు మార్చుకోవాలి. ఎవరికైనా ఒక్కసారే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే.. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమత్యుల్యం ఉండేలా అన్ని పదార్ధాలను చేర్చుకోవాలి.