Indoor plants: ఇంట్లో ఎలాంటి మొక్క‌లు పెంచుకుంటే మంచిది?

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits of Houseplants

ఇంట్లో మెుక్కలు పెంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా పెంచే మొక్కలు ఉన్నాయి. ఇండోర్‌ లో పెంచే మొక్కలు చెడు గాలిని శుభ్రం చేస్తాయి. తాజా ఆక్సిజన్‌ను అందించడమే కాదు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. మొక్కలకు నీళ్లు పట్టడం, పొడవు పెరిగిన మొక్కల భాగాలను కత్తిరించడం వంటి పనులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు.

ఇంట్లో మొక్కలను పెంచుకోవటం వల్ల అందంతో పాటు, వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతాయి. ఇండోర్‌ లో పెంచే మొక్కలకు నేరుగా సూర్యరశ్మి పెద్దగా అవసరం ఉండదు. అలాగే వాటి గురించి ప్రతి రోజూ శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే చూసేందుకు మాత్రం ఆ మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా పరిశోదనలు చెబుతున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఇంటి వాతావరణం పొడిగా, వేడిగా అనిపించకుండా ఆహ్లాదంగా మారుతుంది.

గదుల్లో సైతం మనీ ప్లాంటేషన్‌ వంటి మొక్క లను పెంచితే వేడిని చాలా వరకూ తగ్గిస్తాయి. ఓ పద్దతుల్లో తీగలు పాతేలా చేస్తే ఇళ్లు అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో గుబురు మొక్కలు ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో వీటిదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. గుబురు మొక్కలు గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తాయి.

ఇండోర్ ప్లాంట్స్ ఇంటి అందాన్ని మరింత పెంచడంతో పాటు ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇవి, సహజసిద్ధంగా గాలి నాణ్యతను పెంపొందిస్తాయి. గాలిలోని కాలుష్యాన్ని తొలగించే సామర్థ్యం వీటికి కలదు. అలాగే, ఇంటికి చక్కటి లుక్ కూడా వస్తుంది. అల్లోవేరా అద్భుతమైన మొక్క. ఇది ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. ఇది పెరగటానికి మంచి సూర్యకాంతి అవసరం. ఇది అందరి ఇంట్లో తప్పనిసరి గా ఉండాల్సిన మొక్క. ఇంట్లో ఈ మొక్క ఉండటం వలన దోమలను వదిలించుకోవటం లో సహాయపడుతుంది. బాహ్య అప్లికేషన్ కోసం అలాగే అంతర్గతంగా అవసరాలకోసం కూడా సేవించవచ్చు. ఇది ఒక గొప్ప హైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

చైనీస్ ఎవర్ గ్రీన్ చాలా రకాల గృహ కాలుష్యాలను నివారించడంలో ఈ మొక్క పనితీరు అమోఘం. గాలిలోని పలు రకాల హానికారక రసాయనాలను తొలగిస్తుంది. తక్కువ వెలుగులో సైతం బతికేస్తుంది. అరెకా పామ్ దీని నిర్వహణ చాలా సులభం. నీరు పోస్తే దానంతట అదే పెరుగుతుంది. ఫార్మల్ డీహైడ్, బెంజీన్ సహా భవనాల్లోపల ఉన్న గాలి కాలుష్యాలను ఇది సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది. గాలిలోకి తగినంత తేమను విడుదల చేస్తుంది. సూర్యుని వెలుతురు కొద్దిగా లభించే చోట దీన్ని ఉంచుకోవాలి. నీరు రోజూ పోస్తుండాలి.

మనస్సును ఆహ్లాదం… ఉత్తేజం కలిగించేందుకు పచ్చని మొక్కలు, పుష్పాలు అవి అందించే సువాసనలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి. ఇళ్లలో సులభంగా పెరిగే మొక్కలు కొన్ని రోజుల పాటు నీరు పోయడం మర్చిపోయినా జీవించి ఉంటాయి. వీటికి ఎలాంటి ఎరువులు అవసరం లేదు. ఇంట్లోని గాలిలో ఉన్న విషపూరితాలను 90 శాతం వరకూ తొలగించే సామర్థ్యం వీటికి ఉంది. ఇంట్లో ఒక చిన్న మొక్కను పెంచుకుంటే అది ఆందోళనా, ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఏకాగ్రతా, జ్ఞాపకశక్తి పెరగడంలో సాయపడుతుంది.

మనం శ్వాస తీసుకునేప్పుడు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతాం. మొక్కలైతే… కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుని ఆక్సిజన్‌ని వదులుతాయి. మొక్కలు ఇంట్లో ఉంటే ఈ ప్రక్రియ చాలా త్వరగా జరిగిపోతుంది. స్వచ్ఛమైన గాలి మనకు అందుతుంది. పచ్చదనం కళ్లకు హాయినిస్తాయి. చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్యులు.

ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నా కుండీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుని బాల్కనీలో అమర్చుకుంటే ఆ అందమే వేరు. బాల్కనీ లోంచి ప్రతిఫలించే కొద్దిపాటి ఆకుపచ్చదనమైనా మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాదు మొక్కల పెంపకంతో మీరు రిలాక్స్‌ అవుతారు.

Leave a Comment