నిత్యం అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు. మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మనం ప్రతి నిత్యం ఇంట్లో వాడే వస్తువుల పట్ల తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి .. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిత్యం ఆరోగ్యంగా జీవించాలంటే .. మంచి సమతుల ఆహారంతోపాటు సరైన జీవన విధానం కూడా అవసరమే. పరిశుభ్రమైన గాలి, వెలుతురు వచ్చే ఇంట్లో నివసించాలి. చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లు గాలి ద్వారానే సోకే ప్రమాదం ఉంది. ఇంట్లోకి సరిగ్గా గాలి వచ్చే విధంగా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.. ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి పోతుంది. అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని.. వీటివల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. అదే విధంగా మనం వాడే ఫిల్టర్లు కూడా ఎక్కువ రోజులైన తర్వాత వాటిని మార్చుకోవాలి.
ఇంటిలో నిత్యం మనం వాడే వస్తులు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
వంటగది పరిశుభ్రతే ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా కాపాడుతుంది. కాబట్టి, వంటగదిలోని టవల్స్, స్పాంజ్‌లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. స్టౌవ్ ఉంచిన ఫ్లోర్‌తో పాటు స్టౌవ్‌పై మరకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వాటిని రోజులతరబడి వాడితే మీతో బ్యాక్టీరియానూ ఉంచుకున్నట్లేనని మరిచిపోవద్దు. టవల్స్‌తోపాటు వంటగదిలోనే మూలకు ఉండే సింక్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే సూక్ష్మక్రిములు చేరకుండా చూసుకోవచ్చు. ఇంట్లో వేర్వేరు వ్యక్తులు చాలా తరచుగా టెలివిజన్‌ను ఉపయోగిస్తారు. దాంతో ఇది సూక్ష్మజీవుల నిలయంగా మారుతుంది. మన ఇంట్లో తరచుగా తాకే ప్రదేశాలలో తలుపు హ్యాండిల్స్ ముఖ్యమైనవి. అందుకే ఇవి సూక్ష్మక్రిములకు నెలవుగా మారతాయి. ఇంటి లోపల బ్యాక్టీరియా వ్యాప్తికి తలుపు హ్యాండిళ్లే కారణమని వైద్యులు కూడా ధృవీకరించారు. అందుకే ప్రతి మూడు, నాలుగు రోజులకోసారి క్రిమిసంహారక ద్రావణంతో తలుపు హ్యాండిల్స్‌ను తుడిచివేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇది మీ రిఫ్రిజిరేటర్ హ్యాండిల్ కు కూడా వర్తిస్తుంది. ఎయిర్ కండీషనర్స్ వల్ల కూడా జలుబు రావచ్చు. కాబట్టి ఎయిర్ కండీషనర్స్ ఫిల్టర్స్ పరిశుభ్రంగా ఉండాలి. ఇక అలంకరణ వస్తువులు విషయానికి వస్తే.. ముఖ సౌందర్యాలకు మెరుగులద్దడానికి ఉపయోగించే మేకప్ బ్రష్ ల వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.. లేదంటే చర్మం సమస్యలు బాధించే ప్రమాదం ఉంటుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి…?
ఇప్పుడు హైటెక్నాలాజీతో వస్తున్న ఫోనుల్లో టివి, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లతో.. రేడియేషన్ ఎక్కువగా ఉండటం వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా జరుగుతోంది. టీవిలను ఎక్కువ సౌండ్ పెట్టుకుని వింటేకానీ స్థిమిత పడరు పిల్లలు. ధ్వని తరంగాలు 85 డెసిబుల్స్ కంటే మించితే చెవులలోని సున్నితమైన టిష్యూల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదే ధోరణి కొనసాగితే వినికిడి లోపం తలెత్తుతుందిమీ పిల్లల చేతిలో ఎక్కువ సమయం టాబ్, ల్యాప్‌టాప్, ఐపాడ్ ఉంటే చాలు పక్కన ఉన్న వాళ్లను సైతం మరిచిపోతారు. ఇలా ఉండటం వల్ల ఏదైనా సమస్య వస్తే తట్టుకొనే శక్తి తొందరగా క్షీణిస్తుంది. వాటి ద్వారా విడుదలయ్యే రేడియేషన్ వల్ల తొందరగా మతిమరుపు వస్తుంది. రోజూ పడుకునే ముందు ఈ వస్తువులను మీకు దూరంగా ఉంచటం మంచిది. లేదంటే మీ ఆలోచన వాటిమీదే ఎక్కువగా ఉండి సరిగ్గా నిద్రపోరు.సమయానికి మించి ఎక్కువగా సంగీతం వినటం, ల్యాప్ టాప్ ముందు గంటల తరబడి కూర్చోవటం వల్ల శరీరం బరువు పెరిగి మధుమేహనికి దారి తీసే ప్రమాదం ఉంది.వీటి నుంచి వెలువడే అతినీలలోహిత కిరాణల ప్రభావం మీ కంటి పై పడి దృష్టి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది.