Hot water Bath: వేడినీటితో స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

By manavaradhi.com

Updated on:

Follow Us

రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే వేడి నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అలసట నుంచి శరీరం, ఒత్తిడి నుంచి మనసు ఉపశమనం పొందుతుంది. వేడినీటితో స్నాన్నం.. చిన్నపాటి ఎక్సర్‌సైజుతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని, రక్తపోటు, మధుమేహం వంటివి కూడా తగ్గుతాయంటున్నారు. రోజూ వ్యాయామం చేయనివారు వేడినీటితో స్నానం చేయడం వల్ల కొంతమేరకు వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో వేడిపుడుతుంది, అదేవిధంగా వేడి నీటితో స్నానం చేసినా శరీరంలో వేడిపుడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వేడినీటి స్నానం వల్ల కేలరీ శక్తి కరిగినట్లు గుర్తించారు. అలా కరిగిన కేలరీలు నడకతో సమానమని తేల్చారు. వేడినీటి స్నానం సైక్లింగ్ వ్యాయామంతో సమానం కాకపోయినా నడిచిన దానితో సమానమని అభిప్రాయపడ్డారు.

స్నానం చర్మాన్ని శుభ్రపరచడం అని అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది అదనపు ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వేడినీరు మీ బాహ్యచర్మాన్నే కాకుండా చర్మం లోపలి పొరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చర్మం యొక్క రంధ్రాలను తెరవడానికి మరియు మృతకణాలను, దుమ్ము మరియు చర్మానికి హాని కలిగించే విషతుల్య మలినాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. వేడినీరు శరీరానికి ఉపశమనం కలిగించేది మాత్రమే కాకుండా, శరీర కండరాలకు కూడా విశ్రాంతిని ఇస్తాయి. తద్వారా మీ శరీరానికి భౌతికంగా మరియు మానసికంగా సడలింపు లభించినట్లవుతుంది. మానసిక ప్రశాంతత తోడై, మంచి నిద్రకు సహాయపడగలదు. క్రమంగా గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. వేడినీటి స్నానం రక్తంలోని గ్లూకోజ్ మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. నిమ్ము, ఆస్థమా వంటి ఊపిరితిత్తుల సంబంధిత లేదా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. వీరికి వేడినీటి స్నానం ఉపశమనాన్ని ఇస్తుంది. వేడినీటి స్నానం అలసిపోయిన శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా, రక్తపోటును తగ్గించడంలో, అవయవాలకు రక్త ప్రసరణ పెంచడంలో, శరీరానికి సరైన నిద్రను ఇవ్వడంలో, తలనొప్పి తగ్గించడంలో, హార్మోనులను సమతుల్యం చేయడంలో అనేక లాభాలను కలిగి ఉంటాయి.

వేడినీటిలో స్నానం చేయడం మీ శరీర రక్తనాళాలకు వ్యాయామం లాగా ఉంటుంది. గుండెకు సరైన రక్త ప్రసరణ అందివ్వడంలో సహాయం చేయగలదు. తద్వారా ఆరోగ్యకర హృదయ స్పందనలు నమోదవుతాయి. గుండె, శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరియు రక్తంలోని ప్రాణవాయువు అన్ని భాగాలకు చేరడం అత్యవసరం. వేడినీటితో స్నానం మూలంగా గుండెకు రక్త ప్రసరణ బాగుగా జరగడం మూలంగా దాని చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయపడగలదు. అలాగని ప్రతి ఒక్కరికీ వేడినీటి స్నానమే ప్రధానమని కాదు. ముఖ్యంగా, తక్కువ రక్తపోటు, స్క్లెరోసిస్ వంటి రోగనిరోధక శక్తి తగ్గుదల వంటి సమస్యలు, మూర్ఛ వ్యాధి వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వేడినీటి స్నానం అంత మంచిది కాదు. ఇవి వారికి సమస్యలను మరింత జఠిలం చేయవచ్చు. చలికాలంలో వేడినీటి స్నానం హాయిగానే ఉంటుంది. అలాగని మరీ వేడి నీటితో స్నానం చేయటం తగదు. ఎందుకంటే వేడి నీరు చర్మం పొడిబారేలా చేస్తుంది. ఫలితంగా దురద పెట్టటం, పొలుసుల వంటివి వేధిస్తాయి. అందువల్ల గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, చర్మం కాస్త తడిగా ఉండగానే మాయిశ్చరైజర్లు రాసుకోవటం మేలు. దీంతో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.

Leave a Comment