Health Tips : ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండాలంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
How To Stay Young Forever

ఎక్కువ కాలం పాటు నిండు యవ్వనంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని నిబంధ‌న‌లు పాటించ‌డం ద్వారా ఎక్కువ‌కాలం పాటు యవ్వనంగా ఉండవచ్చు.

ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా, ఆనందంగా బతకగడం గురించి ప్ర‌తీ ఒక్క‌రూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో…మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల వృధాప్య ఛాయలు దరికిరాకుండా కాపాడుకోవచ్చు.

చిన్న పాటి జాగ్రత్తల ద్వారా నిత్యం యవ్వనంలా ఉండేలా చూసుకోవచ్చు. ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అలాగే రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం.

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. నిత్యం యవ్వనంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చుసుకోవాలి. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే డీ విట‌మిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువసేపు ఎండలో ఉండడం కూడా మంచిది కాదు దీనివల్ల చర్మం త్వరగా పాడైపోతుంది. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.

కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి.

అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవడం వల్ల వయసు ప్రభావం చర్మంపై పడకుండా చేయవచ్చు. ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా ఉంటాయి.

రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్‌ అనే పదార్థం చర్మానికి సరఫరా అవుతున్న రక్తాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం డల్‌గా మారుతుంది. జీవం కోల్పోయినట్లుగా మారుతుంది. కాబట్టి స్మోకింగ్‌ వదిలేయండి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన యవ్వనంగా ఉండవచ్చు.

Leave a Comment