Health news: ఆరోగ్యవంతుల అలవాట్లు ఇవే

By manavaradhi.com

Published on:

Follow Us
Importance of healthy habits

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సొతం చేసుకోవచ్చు.


వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఆరోగ్యం విషయంలో ఆహారాలు ముఖ్యమైన పాత్రను పొషిస్తాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి.

ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకొంటేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. లేదంటే ఆకలి, నీరసంతో పనిచేయగలం అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారము తీసుకోవడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను వెంట తెచ్చుకొని తింటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మ‌న శ‌రీరానికి సూట్ అయ్యే ఆహారాల‌పై దృష్టిపెట్టాలి. సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. మధ్యాహ్న భోజనంలో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా వాటిని దూరంగా ఉంచితే మంచిది.

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లే కీలకం. మ‌నం చేసే పనులు, అనుసరించే నియమాల పైన మాత్రమే మ‌న‌ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మ‌రిచిపోవ‌ద్దు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే డీ విట‌మిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.

Leave a Comment