Health Care: జీవన గడియారం సరిగా గడవాలంటే విశ్రాంతి, నిద్ర తప్పనిసరి

By manavaradhi.com

Published on:

Follow Us
Role of sleep, Relaxation

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు సరైన స్థాయిలో విశ్రాంతి కూడా అవసరమే. వ్యాయామం ద్వారా శారీర ఆరోగ్యం చేకూరితే నిద్ర, విశ్రాంతి ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రశాంతత ప్రాధాన్యత, ప్రశాంతకరమైన జీవనం కోసం నిద్ర, విశ్రాంతి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ప్రతి ఒక్కరి జీవన గడియారం సరిగా గడవాలంటే విశ్రాంతి, నిద్ర తప్పనిసరి. చక్కని తిండి, సరైన వ్యాయామంతో పాటు విశ్రాంతి కూడా అవసరమే. ఆహారం లేకపోయినా, వ్యాయామం లేకపోయినా పెద్ద సమస్యలు ఎదురు కాకపోవచ్చు. కానీ విశ్రాంతి, నిద్ర లేకపోతే మాత్రం ప్రశాంతత ఉండదు. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు హేతువు అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజీ జీవితంలో ఉదయం లేచింది మొదలు, పడుకునే వరకూ అనేక ఒత్తిడులను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నిద్రలేమి ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా అనేక శారీరక మానసిక సమస్యలు ఎదురౌతూ ఉన్నాయి.

సరైన స్థాయిలో నిద్ర, విశ్రాంతి లేకుంటే జీవక్రియలు సరిగా జరగవు. శరీరంలోని అలసట పూర్తిగా దూరం కాదు. ఫలితంగా జీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు దరి చేరుతాయి. గుండె సంబంధిత వ్యాదులు, డయాబెటిస్, కీళ్ళనొప్పులు, ప్రీమెచ్యూర్ ,ఏజింగ్ వంటి సమస్యలన్నీ నిద్రలేమి వల్ల కలుగుతాయని అద్యయనాలు చెబుతున్నాయి. సరైన నిద్ర వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తుకుంటున్న వారు నిద్ర విషంలోనూ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

నిద్ర సమయంలో శరీరంలోని జీవక్రియలన్నీ నియంత్రణలో ఉంటాయి. కొన్ని హార్మోన్లు రక్తంలో కలిసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి నిద్ర చాలా అవసరం. మన ఆరోగ్యకరమైన ఒత్తిడి మరియు నిద్ర రెండూ ఒకే రకంలాంటివే. ఈ రెండూ హృదయ ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. సరైన నిద్ర పొందడం వల్ల ఒత్తిడిని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా రక్తపోటు లాంటివి అదుపులో ఉంటాయి.

నిద్రలేమితో నిరాశ నిస్పృహలకు గురౌతారు. మంచి నిద్రను పొందడం వల్ల వ్యక్తి మూడ్ మారుతుంది. ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకొంటారు. నిద్రలేమితో మెదడు మీద ఒత్తిడి పెరిగి హార్మోన్ల లోపంతో జుట్టు రాలడం లాంటి సమస్యలకు దారితీస్తుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా షిఫ్ట్ డ్యూటీల్లో పని చేసే వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే శారీరక మానసిక ఆరోగ్యానికి నిద్ర తప్పనిసరి. అలా అని అతి నిద్ర కూడా అస్సలు మంచి కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు, చిన్న పిల్లలు 11 గంటలు, టీనేజీలో ఉండేవారు 10 గంటలు నిద్రపోవాలనేది నిపుణుల సలహా. అతి నిద్ర వల్ల జ్ఞాపకశక్తి క్షీణించి, మానసిక సమస్యలు ఎదురౌతాయనేది వారి మాట.

నిద్ర లేమి సమస్యను అందిగమించి, నాణ్యమైన నిద్ర కోసం ప్రయత్నించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని అందుకోవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ప్రధానమైనది రోజూ ఒకటే వేళ నిద్రకు ఉపక్రమిస్తుండాలి. 20 నిముషాల వరకూ నిద్ర పట్టకుంటే, ధ్యానం లాంటి వాటి ద్వారా సాంత్వన పొంది నిద్రకు ఉపక్రమించాలి. పడక గదిని నిద్ర పోవడానికి, విశ్రాంతికి మార్గంగా మార్చుకోవాలి. అక్కడే తినడం, టీవీ చూడడం, ఆఫీసు పనులు చేసుకోవడం లాంటివి చేయకూడదు. నిశ్శబ్ధంగా, రణ గొణ ధ్వనులు లేకుండా తీర్చిదిద్దుకోవాలి.

నిద్ర పోయే ముందు మరీ ఎక్కువ ఆహారం తీసుకోవడం గానీ, ఆల్కహాల్ తీసుకోవడం గానీ, కాఫీ లాంటి ద్రవాలు తీసుకోవడం కానీ చేయకూడదు. నిద్ర పట్టడం కోసం ప్రత్యేకమైన మందులు లాంటివి అస్సలు వాడకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేసినట్లైతే చక్కని నిద్ర పడుతుంది. అదే విధంగా గదిలో ఉష్ణోగ్రతను ఆహ్లాదంగా ఉంచుకోవడం, పరిమళ భరితంగా మార్చుకోవడం వల్ల కూడా చక్కని నిద్రకు అవకాశం ఉంటుంది.

Leave a Comment