HEALTH TIPS : ఆయుషును పెంచే ఆరోగ్య రహస్యాలు

By manavaradhi.com

Published on:

Follow Us

మన వయసు రోజురోజుకి పెరుగుతుంటే, ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల మన ఆయుష్షును పెంచుకోవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని మరింత పెంచుకోవచ్చు. చిన్న పాటి జాగ్రత్తల ద్వారా మనసుకు వయసు పెరగకుండా చూసుకోవచ్చు. తద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేసే వారికి ఇది అత్యంత ఆవశ్యకం.

కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

వయసు పెరిగే కొలదీ గుండే విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. వ్యాయామం కూడా మేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో గుండె పరీక్షలు చేయించుకుని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన ఆయుష్షు పెంచుకోవచ్చు. వయసు పెరగ‌డాన్ని ఆపటం ఎవరితరమూ కాదు. కానీ మంచి జీవన శైలిని అలవర్చుకుంటూ… చెడు అలవాట్లను విసర్జించడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోవచ్చు.

Leave a Comment