Stress: ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలివే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Stress Busters

హాయిగా బ్రతకాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. చాలా మంది ఏమీ చేయాలనిపించటంలేదు.. ఉత్సాహంగా ఉండలేకపోతున్నాం అంటుంటారు. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు.

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లే కీలకం. మ‌నం చేసే పనులు, అనుసరించే నియమాల పైన మాత్రమే మ‌న‌ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మ‌రిచిపోవ‌ద్దు. నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. కొద్దిగా స్వీయ సంరక్షణతో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఆందోళన భావాలు క్రమం తప్పకుండా పనిలో లేదా ఇంట్లో సమస్యలను కలిగిస్తే, వాటి గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.

మీరు మానసిక ఒత్తిడికి గురవుతుంటే మీ స్నేహితునితో కలిసి వాకింగ్ వెళ్ళండి. మీకు దగ్గరలో స్నేహితులు లేక పోతే కనీసం వారితో ఫోన్ లో అయిన కొంచ సమయం సరదాగా మాట్లాడండి. దీంతో ప్రశాంతత లభిస్తుంది. ఆందోళనలో ఉన్నప్పుడు కొద్దిగా డార్క్ చాక్లెట్ తినండి. ఇది మీ మెదడుకు ఎక్కువ రక్త ప్రవాహాన్ని కలిగించే ఫ్లేవనోల్స్ అనే రసాయనాలను కలిగి ఉంది. అంతే కాదు మరింత స్పష్టంగా ఆలోచించడంలో మీకు సహాయపడుతుంది. కాకపోతే అతిగా తినవద్దు. చాక్లెట్‌లో అధికంగా కేలరీలు మరియు కెఫిన్ కూడా ఉన్నాయి. చికాకుగా ఉన్నప్పుడు మనసుకు నచ్చిన పాట వినండి. వినడమే కాదు వీలైతే బిగ్గరగా పాడండి. ఇలా చేస్తే చికాకు తొలగిపోయి మనసు కాస్తయినా తేలిక పడుతుంది. ఈ దెబ్బకు బీపీ, ఒత్తిడి లాంటివి పారిపోతాయి.

మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చు. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మానసికొల్లాసం..మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది.ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే..ఇలాగే మాయమై పోతుంది.నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్‌ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్‌ వల్ల మూడ్‌ లిఫ్ట్‌ అవుతుంది. మీరు ఎవరికైనా మంచి చేసినప్పుడు, మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన నొప్పి నివారణ మందులుగా పనిచేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా మీ ఆత్మగౌరవాన్ని పెంపొందింస్తుంది.

పెంపుడు జంతువులు యజమానులతో బాగా సన్నిహితంగా వుంటాయి. ఒంటరిగా వుండే వాళ్ళతో పోలిస్తే పెంపుడు జంతువులు వున్నవాళ్ళు ఒత్తిడిని బాగా అధిగమిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మీ పెంపుడు జంతువుతో భావోద్వేగ అనుబంధం కలిగితే మీకు ప్రతికూల ఆలోచనలు రావు. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.

అపుడప్పుడు బయటకు వెళ్ళుతూ ఉండడండి. దీని వల్ల మీ మానసిక స్థితి కొంచెం మెరుగు పడుతుంది. మీకు పెంపుడు కుక్క ఉంటే దాన్ని తీసుకుని బయటకు వెళ్ళండి. దీంతో మీకు కొంచం ఒత్తిడి తగ్గుతుంది.రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు.

ఆరోగ్యం విషయంలో ఆహారాలు ముఖ్యమైన పాత్రను పొషిస్తాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. మ‌న శ‌రీరానికి సూట్ అయ్యే ఆహారాల‌పై దృష్టిపెట్టాలి. మీ జీవిత భాగస్వామితో సెక్స్ కూడా మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు ఒత్తిడి నుంచి బయటకురావడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. శ్వాసపై దృష్టి పెట్టండి మరియు మీ మనస్సును ఆలోచనలు లేకుండా ఉంచడానికి ప్రయత్నించండి. ఒక ఆందోళన మీ మనస్సులోకి ప్రవేశించినప్పుడు, దాన్ని వీడటానికి ప్రయత్నించండి. ధ్యానం మిమ్మల్ని శాంతింపజేస్తుంది.. మానసిక స్థితిని పెంచుతుంది.మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. నిద్ర ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే మానసిక స్థితిని మరియు దృష్టిని పెంచుతుంది.

ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీకు నిద్రపోవడానికి ఇబ్బంది ఉంటే, మీ గదిని చల్లగా, చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంచండి . నిద్రపోవడానికి ముందు టీవీ చూడకండి అలాగే కంప్యూటర్‌ను ఉపయోగించవద్దు. ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. జీవితంలో అనుకూలతను తిరిగి తీసుకురావడానికి ఒకరోజు పర్యటనను మించింది ఏదీ లేదు. కనుక మీరు ఎపుడైనా ఒత్తిడికి గురౌతే, బట్టలు సర్దుకుని వెకేషన్ కి వెళ్ళండి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Leave a Comment