హాయిగా బ్రతకాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటుంటారు. రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని నిబంధనలు పాటించడం ద్వారా హాయిగా జీవించవచ్చు అంటున్నారు.
మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చు. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మానసికొల్లాసం..మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది.ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే..ఇలాగే మాయమై పోతుంది.నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది.
పెంపుడు జంతువులు యజమానులతో బాగా సన్నిహితంగా వుంటాయి. ఒంటరిగా వుండే వాళ్ళతో పోలిస్తే పెంపుడు జంతువులు వున్నవాళ్ళు ఒత్తిడిని బాగా అధిగమిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మీ పెంపుడు జంతువుతో భావోద్వేగ అనుబంధం కలిగితే మీకు ప్రతికూల ఆలోచనలు రావు. పచ్చికను కత్తిరించడం పనిలాగా అనిపించవచ్చు. కాని గడ్డి వాసన మీకు మరింత రిలాక్స్ గా అనిపిస్తుంది. గడ్డి నుండి వచ్చే రసాయనాలు మెదడులోని ఒత్తిడి హార్మోన్ల విడుదలను నిరోధించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ గా తాగడం వల్ల బాడీ రిఫ్రెష్ అవ్వడం మాత్రమే కాదు, ఇందులో ఉండే మినిరల్స్, ఫ్లెవనాయిడ్స్, విటమిన్స్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి , వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సమాయడపుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం గొప్ప మార్గం. ఇది మీ శరీరం ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
మీ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఆందోళనకు గురిచేసే వాటిని మరచిపోవడంలో సహాయపడుతుంది. ఎండ వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి పెరుగుతుంది. చూయింగ్ గమ్ మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. పరిశోధనల ప్రకారం చూయింగ్ గమ్ నమలడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది. అంతేకాదు మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది.
ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం సరైన మార్గం. దీనివల్ల చక్కని శరీర సౌష్టవమే కాకుండా, శరీరంలో అనుకూలతని కూడా తీసుకువస్తు౦ది. వ్యాయామం వల్ల సేరోటోనిన్, టెస్టోస్టెరాన్ విడుదల అవడంవల్ల మనసు నిలకడగా ఉండడం, నిరుత్సాహపరిచే ఆలోచనలను పోగొట్టడం జరుగుతాయి.స్థల మార్పు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి ఎపుడూ సహాయపడుతుంది. జీవితంలో అనుకూలతను తిరిగి తీసుకురావడానికి ఒకరోజు పర్యటనను మించింది ఏదీ లేదు. కనుక మీరు ఎపుడైనా ఒత్తిడికి గురౌతే, బట్టలు సర్దుకుని వెకేషన్ కి వెళ్ళండి.
ఒత్తిడిలో ఉన్నపుడు, సంగీతం వినడం వల్ల ఒత్తిడి స్థితినుండి త్వరగా కోలుకోవచ్చు. మానసిక స్థితి మేరుగవడానికి ఉద్వేగాలను రేకెత్తించే సామర్ధ్యం సంగీతానికే ఉంది. అయితే, మరీ భావోద్వేగ౦తో కూడిన పాటలను వినడం నివారించాలి, వాటివల్ల మనసుపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.
వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు.