Sleeping Tips : రాత్రంతా నిద్ర రావట్లేదా? చక్కటి నిద్ర కోసం చిట్కాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Tips for better Sleep

మనిషి నేటి ఉరుకులు పరుగుల జీవితం కారణంగా కంటి నిండా తృప్తిగా నిద్రపోని సంధార్భాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు చూసినా క్షణం తీరికలేని బిజీ జీవితం. నిద్ర చాలకపోవడం వల్ల దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై చాలానే ఉంటుంది. హాయిగా కంటి నిండా నిద్ర పడితేనే మర్నాడు చక్కగా పనులు చేసుకోగలుగుతాం..మ‌రి కంటి నిండా నిద్ర పోవాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా మంచి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు..?

నిద్ర భగవంతుడు మనిషికిచ్చిన ముఖ్యమైన వరాల్లో ఒకటి. అలసిన శరీరాన్ని సేదతీర్చెది నిద్ర. గడిచిపోయిన జీవితంలోని మంచిచెడులను , కష్టసుఖాలను మర్చిపోయేలా చేసేది నిద్రే. ఆహారం లేకపోయినా ఉండవచ్చేమో గానీ కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి సుఖంగా ఉండలేడు.ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరయా అంటే కంటినిండా నిద్రపోయేవాళ్లే. ఉదయం లేచింది మొదలు అనేక ఒత్తిడులతో జీవనం గడిపేవారు నిద్రలేమిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. ఫలితం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి.

తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువని వైద్య నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. నిద్ర వల్ల విశ్రాంతిని పొందడమే కాదు మన శరీరంలోని అతి ముఖ్య పనులకు సహాయపడుతుంది.

  • కంటి నిండా నిద్ర‌పోయేందుకు చిన్న చిన్న చిట్కాలు చాలా బాగా ప‌నిచేస్తాయి. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
  • ముఖ్యంగా రాత్రి వేళ‌లో చాలా త‌క్కువ‌గా ఆహారం తీసుకోవాలి. మ‌సాలాలు అస‌లే తీసుకోవ‌ద్దు.
  • ప‌గ‌లు నిద్ర‌పోయే అల‌వాటును పూర్తిగా మానుకోవాలి.
  • నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంట ముందు టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ వంటివి చూడటం ఆపేయండి.
  • నిద్ర పోయేందుకు కనీసం అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగడం వ‌ల్ల మంచి నిద్ర పొంద‌వ‌చ్చు.
  • నిద్రించే స‌మ‌యంలో ఆహ్లాద‌బ‌రిత‌మైన సంగీతం, ఇష్ట‌మైన పాట‌లు విన‌డం వ‌ల్ల ప్ర‌శాంత‌త పొంది హాయిగా నిద్ర‌పోవ‌చ్చు.
  • బెడ్ రూంలో మితిమీరిన వెలుతురు లేకుండా చూసుకోవాలి.
  • కొన్ని రకాల మందులు వాడటం వంటి వాటి వ‌ల్ల కూడా నిద్ర క‌రువ‌వుతుంది.
  • దుప్పట్లు, దిండ్ల విషయంలో ఎట్టి సౌకర్యాన్ని వీడ కూడదు.
  • కచ్చితంగా దీర్ఘకాలిక నొప్పులు ఉన్న వారు నిద్రలేమి రాకుండా మంచి పరుపులు వాడాలి.
  • వ్యాయామం కూడా మంచి నిద్రకు సాధనంగానే చెప్పుకోవాలి.

నిద్ర లేమి సమస్యను అందిగమించి, నాణ్యమైన నిద్ర కోసం ప్రయత్నించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని అందుకోవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ప్రధానమైనది రోజూ ఒకటే వేళ నిద్రకు ఉపక్రమిస్తుండాలి. 20 నిముషాల వరకూ నిద్ర పట్టకుంటే, ధ్యానం లాంటి వాటి ద్వారా సాంత్వన పొంది నిద్రకు ఉపక్రమించాలి. పడక గదిని నిద్ర పోవడానికి, విశ్రాంతికి మార్గంగా మార్చుకోవాలి. అక్కడే తినడం, ఆఫీసు పనులు చేసుకోవడం లాంటివి చేయకూడదు.

నిశ్శబ్ధంగా, రణ గొణ ధ్వనులు లేకుండా తీర్చిదిద్దుకోవాలి. నిద్ర పోయే ముందు మరీ ఎక్కువ ఆహారం తీసుకోవడం గానీ, ఆల్కహాల్ తీసుకోవడం గానీ, కాఫీ లాంటి ద్రవాలు తీసుకోవడం కానీ చేయకూడదు. నిద్ర పట్టడం కోసం ప్రత్యేకమైన మందులు లాంటివి అస్సలు వాడకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేసినట్లైతే చక్కని నిద్ర పడుతుంది. అదే విధంగా గదిలో ఉష్ణోగ్రతను ఆహ్లాదంగా ఉంచుకోవడం, పరిమళ భరితంగా మార్చుకోవడం వల్ల కూడా చక్కని నిద్రకు అవకాశం ఉంటుంది.

నిద్ర మాత్రలు లాంటి ప్రేరేపించే ఔషధాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. నిద్ర విషయంలో ఏ సమస్య వచ్చినా, వైద్యుని సంప్రదించి, కారణం కనుక్కుని మంచి పరిష్కారాన్ని పొందడం తప్పనిసరి. దీని పట్ల అవగాహనతో, సరైన జాగ్రత్తలు పాటించి, చక్కని నిద్ర పొందుదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Leave a Comment