Baking Soda Benefits : బేకింగ్​ సోడాతో అందం, ఆరోగ్యం మీ సొంతం..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Baking Soda Benefits

బేకింగ్ సోడాను సోడియం బై కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలియదు. ఇది వంటలుకు మాత్రమే ఉపయోగించరు. బేకింగ్ సోడాను ఆరోగ్యానికి, స్కిన్ కేర్ మరియు బ్యూటీ ట్రీట్మెంట్ లలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఆర్గాన్స్ వల్ల అటు బ్యూటీలోనూ, ఇటు ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ఫలితాలను అంధిస్తుంది.

సాధారణంగా బేకింగ్ సోడాను వంటగదిలో ఉపయోగించి వంట దినుసుగానో, ఫ్రిజ్ లో వాసనను పొగొట్టే చిట్కా పదార్థంగానో భావిస్తుంటాం. సోడియం బై కార్బోనేట్ గా పిలిచే బేకింగ్ సోడా మన శరీరాన్ని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. బేకింగ్ సోడా వల్ల కలిగే తొలి ఉపయోగం పళ్ళను శుభ్రంగా ఉంచడమే. పళ్ల మీద పేరుకు పోయిన పచ్చదనాన్ని చక్కగా తొలగించడంలో బేకింగ్ సోడా ఎనలేని పాత్ర పోషిస్తుంది.

పేస్ట్ బదులుగా దీన్ని వాడడం వల్ల దంతక్షయం, కావిటీస్ సమస్య నుంచి కాపాడుతుంది. చాలా చోట్ల నీటిలో యాడెడ్ ఫ్లోరైడ్ ఉంటుంది గనుక, సాధారణ టూత్ పేస్టుతో పాటు దీనిని వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు కూడా బేకింగ్ సోడా కలిపిన నీటితో నోరు శుభ్రం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల పెద్దగా వాసన రాకపోయినా, చెడు వాసనను పోగొడుతుంది. శరీరం నుంచి దుర్వాసన వచ్చే వారికి కూడా బేకింగ్ సోడా మంచి మందు. శరీరంలో క్రిములు పేరుకుపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది.

బట్టలు ఉతికే నీటిలో కూడా దీన్ని వేసుకుని వాడడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్టిక్ డియోడెరెంట్లలోనూ బేకింగ్ సోడా ఉంటుంది. వాటిలో కలిపే పదార్థాలు ఏమిటనే విషయాన్ని ఒక్క సారి ఆలోచిస్తే, అందులో బేకింగ్ సోడా పేరు ఉంటుంది.

కిడ్నీలకు మంచి సాయాన్ని అందించడంలో బేకింగ్ సోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో మధుమేహం, అధిక రక్తపోటు లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల వచ్చే దీర్ఘకాలిక మూత్ర పిండ వ్యాధుల్ని తగ్గించడంలో దీని పాత్ర ఎంతో ఉంది. శరీరంలో ఆమ్లస్థాయిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. గుండె సంబంధ సమస్యలు, విషయప్రయోగం లాంటి సమయాల్లో సోడియం బై కార్బొనేట్ పాత్ర ఎనలేనిది.

క్యాన్సర్ కోసం కీమో థెరఫి ఔషధాలు వాడే వారు కూడా, దీన్ని ఉపయోగించి, ప్రయోజనాలు పొందవచ్చు. క్యాన్సర్ కణాల విషయంలో పెరగుదలను ఆపేందుకు కూడా సాయం చేస్తుంది. చిన్న చిన్న పురుగు కుట్టినప్పుడు చికాకు, నొప్పి, దురద, ఎర్రబారడం లాంటి సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు 3 భాగాల బేకింగ్ సోడాకు, ఒక భాగం నీరు చేర్చి, మిశ్రమంగా కలిపి, చర్మం పై పూసి 20 నిముషాల పాటు ఆగి, సగం కప్పు బేకింగ్ సోడా కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

సన్ బర్న్స్ నుంచి కూడా బేకింగ్ సోడా మంచి ఉపశమనంగా పని చేస్తుంది. 4 టేబిల్ స్పూన్ల ద్రావణంలో తడిగుడ్డను నానబెట్టి, చర్మం మీద ఉపశమనానికి ప్రయత్నించండి. ఇది చిన్న పాటి కాలిన ప్రదేశాల్లో కూడా వాడవచ్చు. అప్పటికప్పుడు ఇబ్బందిని తొలగిస్తుంది.

గొంతులో త్రేన్పుల విషయంలోనూ బేకింగ్ సోడా కలిపి తాగే నీరు మంచి ప్రయోజన కారి. సున్నితమైన ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. జుట్టును శుభ్రం చేయడంలోనూ బేకింగ్ సోడా పాత్ర ఎనలేనిది. స్నానం చేసే నీటిలో కాస్త బేకింగ్ సోడా కలుపుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పసిపిల్లల బొమ్మలు, బట్టలు శుభ్రం చేయడానికి నీటిలో దీన్ని కలపడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

బేకింగ్ సోడాతో క్రిములు చనిపోతాయి. కట్టుడు పళ్ళను సంరక్షించేందుకు కూడా బేకింగ్ సోడా నీటిని ఉపయోగించవచ్చు. బై కార్బోనేట్ మరియు నీటితో కలిపిన ఉప్పుతో శుభ్రం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.శరీరంలో ఎక్కడ చర్మ సమస్యలు వచ్చినా, కాస్త బేకింగ్ సోడా వేసిన నీటితో స్నానం చేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీని వల్ల ఇతర ఇబ్బందులు ఉండకపోవడం వల్ల చర్మం వరకూ బేకింగ్ సోడాను నిరభ్యంతరంగా వాడవచ్చు. కానీ ఆహారంలో వాడే విషయంలో మాత్రం వైద్యుని సలహా లేకుండా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అందుకే దీన్ని ఎంత మేరకు తీసుకోవాలనే విషయాన్ని వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

ముఖాన్ని స్ర్కబ్ చేయడం లేదా పెడిక్యూర్ చేసుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు . ఇందులో ఉండే యంటాసిడ్, బేకింగ్ సోడా ప్రకృతిలో మద్యస్థ ఆమ్లం, కాబట్టి మలినాలను శుభ్రపర్చే సామర్థ్యం ఇందులో పుష్కలంగా ఉంది. ఇది ముఖ చర్మం మరియు శరీర చర్మ సంరక్షణకోసం ఒక మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది.దీని పట్ల అవగాహనతో సరైన పద్ధతిలో బేకింగ్ సోడా ఉపయోగించుకుని, ఆ ప్రయోజనాలు అందుకుందాం.

Leave a Comment