ఒక్క కప్పు కాఫీ మీ హార్ట్ ఫెల్యూర్ ను తగ్గిస్తుంది. ఇదేంటి కొందరు కాఫీ తాగితే ప్రమాదం అంటున్నారు. అసలు మీరు చెపుతున్నది నిజమా ? అన్నసందేహం వస్తోందికదు. సహజంగా మన భారతీయులు కాఫీ ప్రియులు పొద్దున్నే మంచం మీద నుంచి లేస్తూనే గొంతులోకి వేడిగా కాస్త కాఫీ పడకపోతే అదోలా ఉంటుంది. కాఫీ తాగడం ద్వారా గుండె సంబందిత సమాస్యలలో ఒకటైన హార్ట్ ఫైల్యూర్ చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ముఖ్యంగా వివిధ రకాల గుండె జబ్బులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికీ హార్ట్ ఫైల్యూర్ రాకుండా కాపాడుతుందట…
మనలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయగానే కాఫీ తాగుతుంటారు. ఇక రోజులో కొందరు ఎన్ని సార్లు కాఫీ తాగుతారో లెక్కే ఉండదు. కొందరు మాత్రం కేవలం ఉదయం, సాయంత్రానికే పరిమితమవుతారు. ఇక కొందరు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు తాగుతారు. సహజంగా కాఫీ నరాల ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది.
కాఫీలను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కాఫీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని అధ్యయానాలు పేర్కొంటున్నాయి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇటీవల చేసిన అధ్యయనంలో కెఫిన్ కాఫీని తాగితే గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చని తేలింది. చక్కెర కలపని బ్లాక్ కాఫీ (కెఫిన్) ని తాగితే గుండె పనితీరు చక్కగా ఉంటుందని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను కూడా ఇది బాగా అరికడుతుందని అధ్యయనంలో తేలింది. రోజూ ఒక కప్పు లేదా రెండు సార్లు బ్లాక్ కాఫీ తాగిన వారిలో గుండె జబ్బులు 30శాతం మేర తగ్గినట్టు అధ్యయనం వెల్లడిచింది.
కాఫీ తాగడం ద్వారా గుండె ఆరోగ్యం ఉంచుకోవచ్చా…?
కాఫీని తాగడం వల్ల చాలామంది వారి యొక్క గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకునే మార్గాలను మెరుగుపరుచుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ గుండెను మరింత దృఢంగా చేసి, దెబ్బతిన్న హృదయ కండరాలను తనంతట తానే సరిదిద్దుకునేలా చేయటంలో సహాయపడుతుంది. హృదయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రభావాన్ని కెఫిన్ కలిగి ఉన్నట్లుగా పలు అధ్యయనాలు వెల్లడించాయి.
రోజుకు రెండు కప్పుల కాఫీ త్రాగటం వల్ల వారి హృదయ కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కాకుండా, దెబ్బతిన్న కండరాల మరమ్మత్తు కూడా చేయవచ్చు. రెండు కాఫీ కప్పులకు సమానమైన కెఫిన్ స్థాయిలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న రక్తనాళాలను కాపాడటమే కాక, గుండెపోటు తరువాత గుండె పనితీరును సరిచేయుటలో సహాయపడుతుంది. ఎందుకంటే కెఫీన్ ‘p27’ అని పిలువబడే ప్రోటీన్‌ను ప్రేరేపిస్తుంది, ఇది గుండె కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది, అలానే గుండె కణాలు దెబ్బతినకుండా సంరక్షించడంలో ఇది సహాయపడుతుంది.
కాఫీలో ఉండే కెఫిన్ మీ గుండెను కాపాడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. గుండె & రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగ్గా, క్రియాశీలకంగా ఎక్కువకాలం కొనసాగేందుకు రోజుకు మూడు కప్పుల కాఫీని వినియోగించడంలో ఎటువంటి హానీ ఉండదు.
కాఫీ తాగగానే మెదడుకు ఎక్కడలేని చురుకుదనం వస్తుంది. కెఫిన్ అనే పదార్ధం మెదడు కణాలను ప్రభావితం చేయగలదు. దీంతో అవి బాగా ఉత్తేజంగా పని చేస్తాయి. మెదడుకు అవసరమయ్యే ఆక్సిజన్, రక్త సరఫరాను పెంచే సామర్థ్యం కూడా కెఫిన్ కు ఉంటుది. అందువల్ల బ్రెయిన్ కాస్త చురుగ్గా పని చేయాలంటే ఆ సయమంలో కాఫీ తాగితే సరిపోతుంది. కెఫిన్ మెదడు కణాలు ప్రభావితంగా పని చేస్తాయి.
కాఫీలో ఆరోగ్యకరమైన అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి కంటి కణాలు ఉత్తేజంగా పని చేసేలా చేస్తాయి. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలంగా రెటీనా ఆరోగ్యకరంగా ఉంటుంది. కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది.
కాఫీ మనిషిలో త్వరగా స్పందించే గుణాన్ని, ఆలోచించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నిస్సత్తువను మాయం చేసి దాని స్థానంలో ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. కాఫీ ఎక్కువగా త్రాగడం వల్ల మనిషిలో ఆకలి చచ్చిపోతుంది. కాఫీలు ఎక్కువగా త్రాగడం వల్ల ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఈ ఆక్సిడెంట్లు ఎక్కువైతే క్యాన్సర్ మరియూ ఉబకాయం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.
ఏదైనా మన పెద్దలు చెప్పారుగా, అతి సర్వాత్రా వర్జయేత్ అని అతిగా కాఫీ తీసుకున్నారో ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాఫీని ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. రోజుకి ఒకటి ..రెండుసార్లు మాత్రమే కాఫీ తాగితే మంచిది.