Dussehra 2023: ఎనిమిదో రోజు 22.10.2023 – శ్రీదుర్గా దేవి (దుర్గాష్టమి) అలంకరణ

By manavaradhi.com

Updated on:

Follow Us

ఆశ్వయుజ శుద్ధ అష్టమి, ఆదివారము, తేది. 22.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీదుర్గా దేవి (దుర్గాష్టమి)గా దర్శనమిస్తారు.

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే |
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ॥

శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు శ్రీకనక దుర్గమ్మవారు శ్రీ దుర్గా దేవి గా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీఅమ్మవారు ఆవిర్భవించింది. ‘దుర్గే దుర్గతినాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన శ్రీదుర్గమ్మవారి దర్శనము సకల శ్రేయోదాయకం.

ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు.

Leave a Comment