నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. రకరకాల కారణాలతో పెద్దవారిలో దంతాలు ఊడిపోతాయి. ఒక్కోసారి అనారోగ్యం వల్ల అయితే ఒక్కోసారి ప్రమాదాల వల్ల. శాశ్వత దంతాలు ఏర్పడిన తర్వాత ….దంతాలు కోల్పోతే వాటి స్థానంలో కృత్రిమ దంతాలు అమర్చడమే… ఇంప్లాంట్.
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్లను 20, 30 ఏళ్లకే పాడు చేసుకుంటున్నారు. ఈ దంతాలను ఇష్టమొచ్చినట్లు వాడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంతాలు దెబ్బతిని పాడైపోతాయి. మరికొన్నిసార్లు కొన్ని రకాల అలవాట్లు కూడా దంతాలను దెబ్బతీస్తున్నాయి. దంతాలు ఊడిపోయినప్పుడు వాటి స్థానంలో కృత్రిమ దంతాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. పంటి మూలానికి ప్రత్యామ్నాయంగా పన్ను క్రౌన్ భాగం నిలబడటానికి శస్త్రచికిత్సతో దవడ ఎముకలో పిల్లర్ వంటి ఆధారాన్ని ప్రవేశపెట్టడమే… ఇంప్లాంట్. స్వచ్ఛమైన టైటానియమ్‌తో తయారేచేసిన ఇంప్లాంట్స్… ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంప్లాంటును అమర్చాల్సిన భాగంలో ముందుగా మత్తు ఇస్తారు. తర్వాత ఇంప్లాంటు సైజును బట్టి ఎముకలోకి రంధ్రం చేసి, అవసరమైనంత మేర దవడ ఎముకను తొలగిస్తారు. అనంతరం అందులో ఇంప్లాంట్‌ను బిగిస్తారు. దీని చుట్టూ ఎముక ఏర్పడి గట్టిపడటానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది. అది స్థిరంగా తయారై.. దంత మూలం మాదిరిగా పని చేస్తుంది. ఆ తర్వాత దాని మీద “క్రౌన్”ను బిగిస్తారు.
డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
దంతాలన్నీ ఊడిపోయిన వారికి డెంటల్ ఇంప్లాంట్స్ చేయవచ్చు. లేదా వెనుక దంతాలు ఊడిపోయిన వారికి వీటిని అమర్చేవారు. దంతాలు లేని పక్షంలో తీసి పెట్టుకునే కృత్రిమ దంతాలను ఉపయోగించాల్సి వచ్చేది. తీసి పెట్టుకునే కృత్రిమ దంతాలు అమర్చుకున్నవారు వదులుగా ఉండటం, అసౌకర్యాన్ని కలిగించడం, కదులుతుండడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా, స్థిరంగా ఉండే కృత్రిమ దంతాలను అమర్చడం సాధ్యమైంది. ఒక్క దంతం మాత్రమే ఊడిపోయిన వ్యక్తికి పక్కన ఉండే దంతాలకు ఎలాంటి హాని కలగకుండా, స్థిరంగా శాశ్వతంగా ఉండే కృత్రిమ దంతాన్ని అమర్చడం ఇంప్లాంట్స్ వల్ల సాధ్యమవు
డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరికి అవసరం అవుతాయి?
తొలినాళ్లలో ఇంప్లాంట్స్ చికిత్స చేయడానికి చాలా సమయం పట్టేది. అయితే ఇంప్లాంట్స్ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికత, దవడ ఎముక గురించి మరింత సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో ఇంప్లాంట్ అమర్చిన వెంటనే వాటిపై దంతాలను అమర్చడం సాధ్యమవుతోంది. ఇంప్లాంట్ డెంచర్స్ కట్టించుకోవాలనుకొనేవారు సాధారణంగా ఏ విధమైన ఇతర వ్యాధులు లేకుండా ఉండాలి. అంటే శస్త్ర చికిత్సకు అనుకూలంగా ఉండాలి. కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు మాత్రం ఇంప్లాంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి.
ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు, కొన్ని రకాల రక్త ప్రసరణ సమస్యలతో బాధపడుతున్నవారు ఇంప్లాంట్స్ చికిత్సకు పనికిరారు. రేడియోథెరపీ, బిస్-ఫాస్ఫొనేట్ వంటి ఔషధాలు వాడుతున్నవారికి ఆయా వ్యాధులకు చికిత్సలు పొందుతున్న సమయంలో ఇంప్లాంట్స్ అమర్చడం సాధ్యం కాదు. అలాగే పిల్లల్లో ఎదుగుదల పూర్తయ్యేవరకూ ఇంప్లాంట్స్ చికిత్సను సూచించరు.ఇంప్లాంట్స్ అమర్చడానికి వయోపరిమితి ఏమీ లేదు. అయితే ఈ చికిత్స చేయించుకోదలచిన ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండకూడదు.