Dry Skin: చర్మం పొడిబారడానికి పోషకాహార లోపమే కారణమా…?

By manavaradhi.com

Updated on:

Follow Us
Dry Skin

డ్రై స్కిన్ తో భాదపడుతున్నవారు చర్మం ఎందుకు పొడిబారుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన చర్మం మీద స్వభావ సిద్ధమైన పలుచని నూనె పొర ఉంటుంది. ఇది చర్మం యొక్క తేమను కోల్పోకుండా సంరక్షిస్తుంది. చర్మం పొడిబారడానికి అనేక కారణాలున్నాయి. చర్మం పొడిబారడానికి పోషకాహార లోపం కూడా ఒకకారణంగా చెప్పవచ్చు. అందుకే అన్ని సమపాళ్ళలో ఉంటే చక్కని ఆహారాలను నిత్యం తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మం కోసం కొవ్వు ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొవ్వు ఆమ్లాలు కణ త్వచంలో ఒక భాగంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. గింజలు, విత్తనాలలో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే హానికరమైన ప్రభావాల నుండి మనల్ని రక్షించి, చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.

అవోకాడోస్ లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే విటమిన్లను కలిగి ఉంటుంది. వీటిని బ్రెడ్ స్ప్రెడ్స్‌ లేదా సలాడ్స్‌లో జోడించి తీసుకోవచ్చు.కొవ్వు చేపల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది మన కణ త్వచాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వారానికి కనీసం మూడు చేపలను తినడం మంచిదని డాక్టర్లు సలహాలిస్తున్నారు.

చర్మం పొడిబారడానికి పోషకాహార లోపమే కారణమా…?

మన శరీరంలోని ప్రతి కణం, కణజాలానికి ప్రోటీన్ చాలా అవసరం. మానవుని చర్మ నిర్మాణం కొల్లాజెన్, కెరాటిన్ ప్రోటీన్లతో రూపొందించబడింది. అందువల్ల, ఆరోగ్యకరమైన చర్మానికి నాణ్యమైన ప్రోటీన్లు అవసరమని గుర్తించుకోండి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే ఆహారాన్ని తీసుకోండి. గుడ్లలో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో సల్ఫర్, లుటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అధిక తేమలో చర్మాన్ని రక్షించడానికి ఇవి సహాయపడతాయి. సోయా శాఖాహారపు ఆహారం. ఇది గరిష్ట మొత్తంలో ప్రోటీన్లను అందిస్తుంది. అంతేకాక, ఇది కొల్లాజెన్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మంపై ఏర్పడే ముడుతలను నివారిస్తుంది.

పాలు, పెరుగు మీ రోజువారీ ఆహారంలో నాణ్యమైన ప్రోటీన్లను చేర్చుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శుభ్రమైన గట్, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉంటే చిన్నచిన్న రంధ్రాలను మూసివేయడంలో, ముడతలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మీ చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

తాజా ఆకుకూరలు,కూరగాయల్లో విటమిన్ ఎ తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవి అధిక యాంటీఆక్సిడెంట్ లెవల్ను కలిగి ఉంటాయి. కాబట్టి, అధిక కేలరీలు ఉండే ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతం అవుతుంది.

ఏ కాలంనైనాలో చర్మాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది మన శరీరానికి బలమైన యాంటీఆక్సిడెంట్లను అందించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సిట్రస్ పండ్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాక, ఇవి రీహైడ్రేషన్కు బాగా పనిచేస్తాయి.టమాటల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది . ఇవి లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.

చర్మం పై పొరలను కాపాడుకోవడానికి విటమిన్ ఎ ఎంతో అవసరం. సూర్యుడి హానికరమైన ప్రభావాల కారణంగా కొల్లాజెన్ విచ్ఛిన్నం ఆపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జుట్టులోని ఫోలికల్స్ చుట్టూ, చర్మంలోని ఆయిల్ గ్రంథులకు సహాయకారిగా నిలుస్తుంది. అంతేకాక, ఇది ఫైబ్రోబ్లాస్ట్స్- కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, కణజాలాలను అభివృద్ధి చేస్తుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఈ రెండు విటమిన్లు ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేసి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి.

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే అది మీ చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.మన శరీరం ఉత్తేజంగా పనిచేయడానికి నీరు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి, చర్మం హైడ్రేట్ చేయడానికి తగినన్ని నీరు త్రాగాలి. ఇది పొడిబారిన చర్మాన్ని నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

మీ చర్మసౌందర్యం కోసం అధిక పోషకాలు, కొవ్వులు, విటమిన్లు అధికంగా ఉండే ఉత్తమ ఆహారాలని తీసుకోవాలి. సహజమైన పద్ధతుల ద్వారానే చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మీ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

Leave a Comment