పండ్లు మనకు చాలా విలువైనవి మరియు పూర్తి పోషకాంశాలు కలిగిఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐతే, ఏవి తినాలి? వేటిలో ఎంత చక్కెర ఉంటుంది అన్నది మనకు తెలియదు. సాధారణంగా ఏ పండ్లు తిన్నా ఆరోగ్యమే. కానీ డయాబెటిక్ పేషెంట్లు చక్కెర స్థాయి తక్కువ ఉండే పండ్లను తీసుకోవడం ఆరోగ్యకరం. అందుకే ఏ పండ్లలో ఎంత శాతం చక్కెర ఉంది.
పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ ఏదో ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అపోహలను మాని వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వంద రోగాలకు ఒక్క పండు అని దానిమ్మను పిలుస్తారు. అంటే చాలా రోగాలకు దానిమ్మ చక్కగా పనిచేస్తుందని అర్ధం. 100 మిల్లీలీటర్ల దానిమ్మ రసంలో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.
- రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు కదా. అది చాలా వరకూ నిజమే. యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 మిల్లీలీటర్ల యాపిల్ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.
- చూడగానే ఆకట్టుకుంటూ, రుచికరంగా ఉండే కమలాపండుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది.
- రుచికి రుచి… ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏ సీజన్‌లోనైనా దొరికే ఈ ద్రాక్ష… మనకు అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాల్ని అందిస్తుంది. చక్కెర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.
- స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లేవనాయిడ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.ఒక గుప్పెడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.
పండ్లు తినడానికి ఒక సమయం అంటూ ఉండదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మన శరీరానికి గ్లూకోజ్, శక్తి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో పండ్లను తినడం చాలా మంచిది. ఆహారం తినడానికి ముందు పండ్లు తినడం వల్ల సులువుగా జీర్ణం అవుతాయి. ఆహారం తిన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పళ్ళను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల అవి జీర్ణ కోశంలో ఇరుక్కుపోయి మేలు కన్నా హాని ఎక్కువ చేస్తాయి. అయితే డయాబెటిస్ తో బాధపడుతున్నవారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహా ప్రకారమే ఈ పండ్లను తీసుకుంటే ఎంతో మంచిది.
చక్కెర అధికంగా ఉండే పండ్లు ఎవరు తీసుకోవకూడదు ?
పండ్లలో రాజుగా చెప్పుకునే మామిడి పండ్లను మధుమేహం ఉన్న వారు తీసుకోకూడదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. సపోటా వల్ల కూడా సమస్యలు ఎదురౌతాయి. పైనాపిల్ మరియు సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఆప్రికాట్ కూడా ఇదే స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. అరటిపండులోనూ పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. పూర్తిగా పండిన అరటిపండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పుచ్చకాయలు కూడా మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. అయితే ఈ పండ్లను జ్యూసుల రూపంలో కాకుండా నేరుగా పండ్ల రూపంలో తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.మనకు మార్కెట్‌లో నేడు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలను పొందడం మాత్రమే కాకుండా శక్తి కూడా అందుతుంది. పండ్లు స్నాక్స్ కు బదులు తీసుకోవాలి. ప్రతీ సీజన్ లో కొన్ని రకాల పండ్లు లభిస్తుంటాయి వీటిని కూడా తప్పక తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.