మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా…! అయితే ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. మాల్‌వేర్ వ్యాప్తి చేస్తున్న 13 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. మీ ఫోన్ లో కూడా ఈ యాప్ లు ఉంటే ఇప్పుడే అన్ ఇన్ స్టాల్ చేయండి.. ఆ యాప్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ప్రస్తుత ఆధునిక యుగంలో అంతా టెక్నాలజీ మీద నడుస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా భద్రత ఎంతో ముఖ్యంగా మారిపోయింది. ఎంతలా అంటే మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో మన వ్యక్తిగత వివరాలు రాబట్టి మనం బ్యాంక్ లో దాచుకున్న డబ్బుఅంతా క్షణాల్లో ఖాళి చేస్తున్నారు. అందుకే యూజర్ల భద్రత కోసం గూగుల్ ఎప్పటికప్పుడు మాల్‌వేర్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంది. అయితే తాజాగా సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే (McAfee) నివేదిక ఆధారంగా 13 యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అంతేకాదు ఎవరైతే యూజర్లు ఈ యాప్ లను వాడుతున్నారో వాళ్ళు వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్‌ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది.
గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిన ఈ 13 యాప్‌లలో హెల్త్, గేమింగ్, రాశి ఫలాలు, ప్రొడక్టివిటీకి సంబంధించిన యాప్‌లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఎవరైతే తమ ఫోన్ లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి వాటిని వాడతారో… వాళ్ల ఫోన్ ఆర్థిక నేరగాళ్ల చేతిలోకి వెళిపోయినట్లే… మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా .. మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీఫోన్ వాళ్లు అంతచూస్తారు. ఎలాగంటే సోషల్ ఇంజినీరింగ్ సాయంతో యూజర్ ప్రమేయం లేకుండా డివైజ్‌ను యాక్సెస్ చేసుకుని, ఆండ్రాయిడ్ చేసే అన్ని రకాల అలర్ట్ మెసేజ్‌లను డిజేబుల్ చేస్తాయి. తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని.. ప్రకటనలపై క్లిక్ చేయడం, మోసపూరిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మెకాఫే తెలిపింది. వీటివల్ల యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం ఇతరుల చేతికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ యాప్‌లను వెంటనే ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు ఎవరైనా ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే డిలీట్ చేయాలని సూచించింది.
గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిన ఆ 13 యాప్‌ల వివరాలు