Andhra Vishnu : శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు క్షేత్రం యొక్క విశిష్టత

By manavaradhi.com

Updated on:

Follow Us

కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున వున్న శ్రీకాకుళం ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా వుండేది. ఎనిమిది మైళ్ల వ్యాసార్థంతో విలసిల్లిన మహానగరంగా (క్రీ.శ. 2వ శతాబ్దం) దీనిని వర్ణించారు. ఇక్కడే ఆంధ్ర విష్ణు దేవాలయం వుంది. తాను ఇక్కడ వున్నప్పుడు స్వామి కలలో మీరూ కనిపించి ఆముక్తమాల్యదను రచించమని ఆనతి యిచ్చినట్లు శ్రీ కృష్ణదేవరాయలు వ్రాసుకొన్నాడు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర లో భాగంగా ఇక్కడి మందిరం గురించి విని స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అలాగే క్రీ.శ. 1519 లో ఇక్కడ ఉన్న ఒక మండపంలో కూర్చొని విష్ణువును తలుచుకుంటూ అముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించాడు. ఇప్పడు ఆ మండపాన్ని ఆముక్త మాల్యద మండపం అని పిలుస్తారు. ఇప్పటికి అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాం మనకు కనిపిస్తుంది.

శాతవాహనుల తరువాత ఈ ఆలయం శిథిలమైంది. మూల విరాట్టు చాలా ఏండ్లు కొల్లూరులో కాచిభొట్లవారి వీధిలో పడి వుండేదిట. దానిని, అనంత దండపాలుడు గుడికట్టి పునః ప్రతిష్ఠ చేశాడు. ఈ క్షేత్ర ప్రశస్తిని చాటే కావ్యాలలో వల్లభాభ్యుదయం, క్రీడాభిరామం, కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం వున్నాయి. ఇక్కడ గల ఏకరాతి ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి కూడ తప్పక చూడదగింది. ఇందులో శివాలయం కూడా వుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు భారీగా ఈ ఆలయానికి తరలి వస్తారు. విజయవాడ మహానగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం గ్రామానికి విజయవాడ, ఘంటసాల, కోడలి, కొల్లూరు ప్రాంతాల నుండి రోడ్డు సౌకర్యం కలదు. విజయవాడ నుండి ప్రతి రోజూ శ్రీకాకుళం మీదుగా ఘంటసాల మండలానికి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి.

Leave a Comment