Janasena : అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచిన జనసేనాని … సంక్రాంతి తర్వాత అధికారికంగా వెల్లడి

By manavaradhi.com

Published on:

Follow Us

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం – జనసేన పార్టీలు కలసి 2024 ఎన్నికలు పోటిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పోటి చేసే నియోజక వర్గాలపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. అందులో జనసేన పోటి చేసే వాటిపై చాలా వరకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది.

మరి కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తి అయింది. పోత్తులో భాగంగా జనసేన పార్టీ ఎక్కనుంచి ఎవరు ఎన్ని స్థాన్నాల్లో పోటీచేయాలనే దాని మీద దాదాపు రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కొన్ని వాటిమీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత వాటి మీద కూడా పూర్తి స్పష్టత రానుంది. దీంతో సంక్రాంతి కన్నా ముందే కొన్ని సీట్ల విషయం ఇరుపార్టీలు ఒక ప్రకట ఇవ్వాలని ముందు అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇరు పార్టీల వారు క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ నుంచి ఎన్ని స్థాన్నాలో పోటీ చేయాలనేది దాదాపుగా తేలిపోయింది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్‌ కలిసి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని మీద సమన్వయ చర్యలూ చేపట్టారు. ఏ కార్యక్రమం నిర్వహించినా జనసేన – తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇకపక్క తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు జరుపుతూనే… మరో పక్క జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతోనూ సమావేశమవుతున్నారు. జనసేన పోటీలో ఉన్న చోట పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి.. అక్కడ తెలుగు దేశం పార్టీతో కలసి ఎలా పనిచేస్తున్నారు అన్న విషయాలను పవన్ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో పవన్‌ చర్చించారు వారి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలంగా ఉన్న ఉభయ గొదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిని పెట్టారు. అందుకు అనుగుణంగానే ఈ మధ్యనే జనసేనాని స్వయంగా కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు ఏకంగా కాకినాడలో లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో దాదాపు అయిదు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ చర్చించుకోవాల్సిన మరొక విశేషం ఏంటంటే అందరితో విడివిడిగా మాట్లాడారు… అప్పటికే తనవద్ద ఉన్న తాను సొంతంగా చేయించుకున్న సర్వేలు, పలు నివేదికను ఆధారంగా కొన్ని అంశాలపై వారిని లోతుగా ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆ నియోజకవర్గంలోని క్యాడర్‌, కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాలు, లోపాలు-ప్రత్యర్థి పార్టీ పరిస్థితులు తదితర అంశాలన్నీ ఈ చర్చల్లో వస్తున్నాయి. నియోజకవర్గంలో ఏయే అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోయేదీ కూడా ఇన్‌ఛార్జులతో చర్చిస్తున్నారు.

మంచి దూకుడు మీద ఉన్న జనసేన పార్టీ అధినాకుడు త్వరలో పవన్‌కల్యాణ్‌ రాజమహేంద్రవరం, భీమవరం నగరాల్లో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి ఒక జనసేన అభ్యర్థిని లోక్ సభకు పంపించాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులందరితో పవన్‌కల్యాణ్‌ ప్రతి విషం చాలా లోతుగా చర్చిస్తున్నారు.

Leave a Comment