2024లో జనసేన పార్టీ పక్కా గెలవబోయే స్థానాలు … పవన్ అడుగుతున్న టిక్కెట్లు ..!

By manavaradhi.com

Updated on:

Follow Us

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ – తెలుగు దేశం విడివిడా పోటిచేశాయి.. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉన్న 40 వేలకు పైగా ఓట్లు సాధించింది. అంతే కాదు 30 నుండి 40 వేలు పైగా ఓట్లు సాధించిన స్థానాలు 13 ఉన్నాయి… అలాగే 15000 నుండి 30 వేల వరకు మరో 18 స్థానాల్లో జనసేన ఓట్లు సాధించగా ఇప్పుడు ఆ 36 స్థానాలు పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం ను అడుగుతుంది. ఇక లోక్ సభలో లక్షకు పైగా ఓట్లు సాధించిన 7 స్థానాలు జనసేన పార్టీకి కావాలంటూ పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది..!

గత ఎన్నికల్లో (2019) 30 వేలకు పైగా ఓట్ల శాతం సాధించిన నియోజకవర్గాలు 18 అయితే అందులో ఐదు నియోజకవర్గాలు ప్రధమ, ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి రాజోలు నియోజకవర్గం 50,053 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో జనసేన పార్టీ తన మొదటి ఎమ్మెల్యేను గెలిపించుకుంది..అదే జిల్లా నుంచి 45,200 ఓట్లతో అమలాపురం ద్వితీయ స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నుండి 49,120 ఓట్లతో నరసాపురం, 62,285 ఓట్లతో భీమవరం రెండో స్థానంలో నిలిచాయి. (ఇక్కడినుంచే జనసేన అధ్యక్షలు పవన్ కళ్యాణ్ పోటిచేశారు) విశాఖపట్నం నుండి 58,539 ఓట్లతో గాజువాక ద్వితీయ స్థానంలోనిలిచింది.

గతంతో పోలుచ్చుకుంటే జనసేన ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు,వారాహి యాత్ర ప్రకంపనలు దృష్ట్యా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు, అమలాపురం, భీమవరం,నరసాపురం, గాజువాక… నియోజకవర్గాలలో.. జనసేన జండా పాతటం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై తెలుగుదేశం నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. పైన పేర్కొన్న ఐదు నియోజకవర్గాలతో పాటు మరో13 నియోజకవర్గాలలో 2019లోనే 30 వేలకు పైగా ఓట్లు సాధించారు. అనకాపల్లి.. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి కాకినాడ సిటీ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ ఉండగా .. కృష్ణాజిల్లా నుండి గన్నవరం. గుంటూరు జిల్లా నుండి తెనాలి వున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.. కొత్తపేట,మండపేట,ముమ్మిడివరం ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుండి.. కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ ఉండగా… పశ్చిమగోదావరి.. జిల్లా నుండి.. తనుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలు ఉన్నాయి.

2019లోనే తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగన జనసేన పార్గీ 30 వేలకు పైగాఓట్లు సాధించిన ఈ 18 నియోజకవర్గాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులతో కలిపి ఎన్నికలకు దిగితే వార్ వన్ సైడే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే వారాహి యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జనసేన మరింతగా బలపడింది. దానికి ఉదాహరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్ల శాతం మనం గమనించవచ్చు.

2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ బయటపడ్డాయి అవేంటంటే.. 20 నియోజకవర్గాలలో 15000 నుండి 20,000 వరకు ఓట్లు సాధించగా…మరో 25 నియోజకవర్గాలలో 10 వేల నుండి 15 వేల ఓట్లు…30 నియోజకవర్గాలలో 5000 నుండి 10000 వరకుఓట్లు సాధించింది. జనసేన అడుగుతున్న 70 నియోజకవర్గాలలో త్రిముఖ పోటీలో సైతం 20 వేలకు పైగా ఓట్లు సాధించిన ఈ 36 నియోజకవర్గాలు.. తెలుగుదేశంలో అడిగినట్లు సమాచారం… దీనికి చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలపడుతుండటంతో 2019… పరిస్థితుల కన్నా నాలుగు రెట్లు అధికంగా ఓట్లు వస్తాయని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు కన్ఫామ్ కావడంతో పొత్తులో భాగంగా 15 వేలకు పైగా ఓట్లు సాధించిన 56 నియోజకవర్గాలు.. తమకు కావాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పినట్లే.. 2024లో.. జనసేన అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Leave a Comment