Immune System Healthy – మీ రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే?

By manavaradhi.com

Published on:

Follow Us
Infections That Aren’t Contagious

మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి ..కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి.

వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు… కొన్నిరకాల అల‌వాట్ల‌ను సొంతం చేసుకోవ‌డం ద్వారా ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం.వ్యాయామం… ఇది చాలా ముఖ్య‌మైంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ‌ల్లో అర్థ‌గంట‌సేపు వ్యాయామం చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి స‌మ‌స్యలు రాకుండా చూసుకోవ‌చ్చు. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. గుడ్లు, చేపలు మరియు పాలు మరియు తృణధాన్యాలు వంటి బలవర్థకమైన ఆహారాలలో పొందవచ్చు. విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మి మరొక ముఖ్య వనరు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే ఈట్ రెయిన్ బో అని పౌష్టికాహార నిపుణులు చెబుతారు. తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. వీటి ద్వారా శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే అవకాశం ఉంటుంది.

శ‌రీరంలో రోగ నిరోధక వ్యవస్థ కోసం కణాలు తయారు కావాలంటే జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. జింక్.. పాలు, గుడ్లు, మాంసం, చిక్కుళ్లు , గుమ్మ‌డి విత్త‌నాలు, చేపలలో ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి .. క్రమం తప్పకుండా ఇలాంటి ఆహారాలను మెనూలో చేర్చుకోవాలి. దీనివల్ల జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియాల‌ను మంచి బ్యాక్టీరియా అంతం చేస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పనిచేస్తూ అలసిపోవడం సహజమే. ఇలా అలసిపోవడం వల్ల ఓ లాభం కూడా ఉంది. కొత్త లక్ష్యాలను ఎదుర్కునేందుకు శరీరం సిద్ధమవుతుంది. కానీ పని ఒత్తిడి ఎక్కువ ఉండడం మంచిది కాదు . దీనివల్ల శారీరక రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. కాబట్టి శారీరక ఒత్తిడి వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది.

పెంపుడు జంతువులను పెంచుకోవడం కూడా శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెంపుడు జంతువులు .. శరీరానికి వ్యాయామం కలిగించడమే కాకుండా .. ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు సహకరిస్తాయి. కుక్కలు, పిల్లులు ఇలాంటి పెంపుడు జంతువులను పెంచుకునే వారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు వారిలో గుండె ఆరోగ్యం కూడా చక్కగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన కూడా చాలా బావుంటుందని చెబుతున్నారు.

Manage Stress
Manage Stress

స్నేహితులతో ఉల్లాసంగా గడపడం, మానసిక సమస్యలు తగ్గించుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఎప్పటికీ పెదవులపై చిరునవ్వు ఉండే వారిలోనూ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎదుటి వాళ్లు వేసే జోకులకు నవ్వినా.. ఫన్నీ వీడియోలు చూస్తూ నవ్వినా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శారీరరక రోగ నిరోధక శక్తి పెరగాలంటే .. మరో సాధారణ మార్గం వ్యాయామం. దీని ద్వారా శారీరక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఆస్టియో పోరోసిస్ , గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

వ్యాయామాలు చేయాలనగానే పెద్ద పెద్ద బరువులు ఎత్తడమని భావించవద్దు . తేలికపాటి వ్యాయామాలు ఏవి చేసినా ఫలితం ఉంటుంది. బైక్ రైడింగ్ , స్విమ్మింగ్ , యోగా లాంటి వాటిని వ్యాయామంలో భాగంగా చేసుకోవచ్చు. రోజూ రాత్రి పూట మంచి నిద్ర కూడా .. శారీరక రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. వివిధ రకాల వ్యాధులతో పోరాడాలంటే రోగ నిరోధక వ్యవస్థకు శక్తి వస్తుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరికి రోజూ రాత్రి పూట 7 నుంచి 9 గంటల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోవాలి.

రోగనిరోధక శక్తి మనకు ఏ వ్యాధులూ రాకుండా కాపాడే శరీరంలోని ఓ రక్షణ వ్యవస్థ. వ్యాధులు వచ్చినా.. దాన్ని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం కూడా ఇదే! వ్యాయామం, మంచి జీవనశైలి ద్వారా మనలోని రోగనిరోధక శక్తిని పెంపోందించుకోవచ్చు.

Leave a Comment