ఓవర్ యాక్టివ్ బ్లాడర్.. ఈ సమస్య వల్ల మాటి మాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. 40 ఏళ్ల వయస్కుల్లో ప్రతి ఆరుగురు వ్యక్తులకు ఒకరు అతిమూత్ర వ్యాధి సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి మూత్ర వ్యాధికి రకరకాల మందులు ఉన్నా.. వాటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది హోమ్ రెమెడీస్ పై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా రోజువారి తీసుకోనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అతిమూత్ర సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అతిమూత్ర సమస్య.. ఇది చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా మూత్రవిసర్జన అనుభూతి కలుగుతుంది. అయితే, ఇది జీవనశైలి సమస్యగా మారవచ్చు. మనరోజువారీ పనులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల సామాజిక సంబంధాలు కూడా దెబ్బ తింటాయి.
చూడ్డానికి ఇది చిన్న సమస్యనే అయినా.. దీని వల్ల ఎన్నో అవకాశాలు చేజారిపోవచ్చు. ఈ సమస్య మూత్రాశయ ఇన్ఫెక్షన్కు కూడా దారి తీయవచ్చు. అందుకే ఈ సమస్యను మొదట్లోనే నివారించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొన్ని ఆహారనియమాలను నిపుణులు సూచించారు. ముఖ్యంగా జీవన విధానంలో మార్పులతోపాటు భోజనం ద్వారా అతిమూత్ర వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. మూత్రశయాన్ని దెబ్బతీసే అంశాలను మనం నియంత్రించగలగాలి.
ఓవర్ యాక్టివ్ బ్లాడర్ తో భాదపడుతున్నవారు ఏ ఆహారాలు తీసుకోకూడదు…?
ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కి ప్రత్యేకమైన ఆహారం లేనప్పటికీ, కొన్ని ఆహారాలను నివారించడం మరియు పరిమితం చేయడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. టీ మరియు కాఫీ ఈ పానీయాలలో అధిక కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మూత్రాశయ కార్యకలాపాలను పెంచుతుంది మరియు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లక్షణాలను మరింత దిగజార్చవచ్చు. సిట్రస్ పండ్లు నారింజ మరియు నిమ్మకాయలు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లక్షణాలను త్వరగా తీవ్రతరం చేస్తాయి. సిట్రస్ పండ్లలో అధిక మొత్తంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, ఇది మూత్రాశయ నియంత్రణను దెబ్బతీస్తుంది.
మూత్ర నాళాల చికాకును నివారించడానికి క్రాన్బెర్రీస్ మరియు ద్రాక్షపండును కూడా తక్కవగా తీసుకుంటే మంచిది. అతిమూత్ర సమస్య ఉన్న వ్యక్తికి, బ్లూబెర్రీస్, అరటిపండ్లు, ఆపిల్ మరియు బేరి వంటి తక్కువ ఆమ్ల పండ్లను తీసుకోవడం ఉత్తమ మార్గం. టమోటాలలో ఆమ్లం అధికంగా ఉన్నందున, అవి మూత్రాశయానికి చికాకుపెడతాయి అంతేకాదు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లక్షణాలను మరింతగా పెంచుతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాస్తా, పిజ్జా సాస్, కెచప్ మరియు సల్సా వంటి టమోటా ఉత్పత్తులను పూర్తిగా నివారించాలి.
అతిమూత్ర సమస్యకు ఆహార జాగ్రత్తలు ఏంటి..?
శీతల పానీయాలు, సోడా వాటర్ మరియు ఎనర్జీ డ్రింక్స్ వంటి ఏదైనా కార్బోనేటేడ్ పానీయాలు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యను పెంచుతాయి. కార్బోనేటేడ్ పానీయాలను దాటవేయడం వల్ల ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లక్షణాలను తగ్గించడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కృత్రిమ స్వీటెనర్లను మీ ఆహారం నుండి పూర్తిగా మానుకోండి.కారంగా ఉండే ఆహారాలు మిరియాలు, స్పైసీ సలాడ్లు మరియు సాస్‌లు వంటి మసాలా ఆహారాలు మూత్రాశయ సమస్యను తీవ్రతరం చేస్తాయి.
ఉప్పగా ఉండే ఆహారాలు బంగాళాదుంప చిప్స్, సాల్టెడ్ గింజలు మరియు ఇతర ఉప్పగా ఉండే ఆహారాలు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇవి నిరంతరం దాహాన్ని కలిగిస్తాయి, ఎక్కువ నీరు త్రాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. శరీరంలో అధికంగా క్యాల్షియం ఉన్నప్పుడు తరచూ మూత్రవిసర్జన చేయాలినిపిస్తుంది. శరీరంలో అధనంగా ఉన్న క్యాల్షియం బ్లాడర్ చుట్టూ స్థిరపడటం వల్ల, నిల్వచేసుకొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇది వెంటనే మూత్రవిసర్జన చేయాలనే కోరికకు దారితీస్తుంది.
ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్న వ్యక్తికి, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి సహజ మరియు తాజా ఆహారాలు ఉండాలి. అరటిపండ్లు, పొటాషియం సమృద్ధిగా మరియు ఫైబర్‌తో ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. జీడిపప్పు, బాదం మరియు వేరుశెనగ వంటి ఆహారంలో భాగం చేసుకోవలి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు విటమిన్ కె లలో అధికంగా ఉండే ఆహారాలు తినడం ద్వారా.. అవి మూత్ర ఉత్పత్తి యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి.