జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడ యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవాలి.. జనసేనాని కాకినాడ పర్యటనతో పార్టీ శ్రేణులకు నూతన ఉత్తేజం వచ్చింది. ఇప్పటికే వారాహి యాత్రలతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది… అదే జైత్రయాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా…. జనసేన పార్టీలోకి చేరికలు కూడా చక్ చకా జరిగిపోతున్నాయి. మూడు రోజుల కాకినాడ యాత్ర విశేషాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వారాహి యాత్ర తర్వాత కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడు రోజుల సమీక్షకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు క్షేత్రస్థాయిలో బలబలాలను బేరీజు వేసుకున్నారు జనసేనాని. అలాగే స్థానిక జనసైనికులను కలిసి దిశ నిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పార్టీ ఎందుకు పనిచేయాలో వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదన్నారు. అదే ధ్యేయం.. లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ అక్రమాలు, దాడులకు హద్దు ఉండదు. అందుకు ధీటుకు సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మూడు రోజుల పాటు జరిగిన తొలి విడత సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాకినాడ నగరంతో పాటు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులతో జనసేనాని విడివిడిగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. అంతేకాదు ఆయన ఒక్కరే వారితో మాట్లాడుతుండటం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలతోపాటు ఇతర పార్టీల పరిస్థితి, తెదేపా నాయకులతో ఉన్న మిత్రత్వం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికీ సంబంధించిన లోతైన సమాచారం సేకరించినట్లు తెలిసింది.
యుద్ధం వచ్చేసింది.. అస్త్రశస్రాలు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ జరిగిన వారాహి యాత్రలోనే యుద్ధానికి సిద్ధమని చెప్పాం. దేనికైనా.. తగ్గేదేలే అన్నట్టుగా ఉండాలి. వైసీపీ అక్రమాలకు మన బలం చాలదనే, టీడీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాం. దీని ఉద్దేశం రాష్ట్రాన్ని రాక్షసుల చేతిలో నుంచి రక్షించడమే లక్షంగా పనిచేయాలన్నారు జనసేనాని. నన్ను విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో… మూడు పెళ్లిళ్లు అంటూ కుటుంబాలను రాజకీయంలోకి లాగుతున్నాడు. మనం కూడా వారి కుటుంబాన్ని విమర్శించవచ్చు. కాని అది మన నైజం కాదు. వాళ్ల ఇంటిలో ఆడపడుచులైనా…మన ఇంట్లో వారైనా ఒక్కటే.. ఇప్పటికైనా జగన్ అది గ్రహించకపోతే.. దాని ఫలితం అనుభవించకతప్పదు అంటూ జనసేన అధినేత పవన్ ధీటుగా గతంలో ధీటుగా సమాధానం చెప్పాడు.
కాకినాడలో రెండో రోజు పర్యటనలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంపై శుక్రవారం రోజంతా సమీక్ష నిర్వహించారు. 20 వార్డులకు చెందిన క్షేత్రస్థాయి నాయకులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ‘ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేయని తప్పంటూ లేదు. అందుకే మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లాయే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు. ఆ బాధ్యత నేను తీసుకున్నా. మన పార్టీ నేతలు వైసీపీ అరాచకాలు, అక్రమాలపై ఇంటింటా తిరిగి ప్రచారం చేయాలి’ జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే మన పోరాటం ఒక్కటే సరిపోదని.. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ‘పొత్తు అనేది పార్టీ పరంగా ఎదగడంలో ఒక భాగం. మన బలం పెరగాలంటే పొత్తులతో వెళ్లి వైసీపీని ఓడించాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బిందాసగా బయట తిరుగుతున్నాడంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవాలి. సమీక్షలో భాగంగా వివిధ వర్గాల మేధావులతో ఆయన భేటీ అయ్యారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.
వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనతోనే ఆయన కూలంకషంగా సమీక్ష చేస్తున్నారని జనసేన నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తంగా మూడు రోజుల్లో నియోజకవర్గం మొత్తం అన్ని వార్డులపై సమీక్ష చేశారు. జనసేనకు ఎదురే లేదు.. ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలు, అక్రమాలు వివరించండి అంటూ జనసైనికుల్లో ఆత్మస్థైర్యం నింపాడు పవన్. మూడు రోజుల సమీక్షకు జనసేనకు అనూహ్య స్పందన వచ్చింది. అనేక మంది జనసేనలోకి వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కూడా జనసేనలోకి రావడం చూస్తుంటే వైసీపీ ఓటమి తప్పదు అనడంలో సందేహం లేదు.