Pawan Kalyan : వారాహి యాత్రకు తాత్కాలిక బ్రేక్.. విదేశీ పర్యటనకు పవన్ కళ్యాణ్

By manavaradhi.com

Updated on:

Follow Us

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. టీడీపి అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తెలుగు దేశం – జనసేన పార్టీలు కూటమిగా 2024 ఎన్నికల్లో విజయమే లక్షంగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రకు స్వల్ప బ్రేక్ ఇవ్వనున్నారు. ఫ్యామిలీతో కలిసి పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లనున్నారు. దింతో వారాహి యాత్రకు లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇంతకు పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా… త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పీఠలు ఎక్కనున్నారు. ఇప్పటికే వీళ్ల పెళ్లి ఇటలీలో ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసింది. అదుంకు అనుగుణంగా మెగా ఫ్యామిలీలో చాలా మంది ఇటలీ చేరుకున్నారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. అందుకు సంబందించిన ఫోట్ లు కూడా సామాజిక మాధ్యమాల్లో చెక్కరలు కోడుతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్ ఇటలీకి పయనం కానున్న నేపథ్యంలోనే వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నారు పవన్. అయితే ప్రస్తుతం అందుకు అనుగుణంగానే ఇక్కడ పరిస్థితులు అన్ని చక్కబెట్టిన తర్వాతే పవన్ ఇటలీ పర్యటనకు వెళ్లనున్నట్టు జనసేన వర్గాలు తెలుపుతున్నాయి.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలల్లో నాలుగో విడత వారాహి విజయ యాత్ర నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, యువత యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. అక్టోబర్ 5 నుంచి వారాహి యాత్రకు తాత్కాలిక బ్రే క్ పడింది. సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహింస్తున్నారు. అనంతరం 12 నుంచి 17 వరకు పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇలా వారానికి పైగా జనసేనాని పార్టీ కార్యక్రమల్లో బిజీబిజీగా గడపనున్నారు జనసేనాని. ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ వస్తే.. ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేవకాశాలు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడ్డాయి.. మరో నెలరోజుల్లో అక్కడ ఎలక్షన్ జరగనుంది. ఈ నెపథ్యంలో అక్కడి నేతలతోనూ పవన్ కళ్యాణ్ సమావేశం కానునట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టికెట్ల కేటాయింపు.. బీజేపీతో పొత్తుతో పాటు.. టీడీపీతో పొత్తు లాంటి అంశాలపై నాయకులతో చర్చించే అవకాశం ఉంది. ఈనెల 17 వరకు పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన అనంతరం జనసేనాని ఇటలీకి పయమనవుతారు. అక్టోబర్ 17న పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుక ముగిసిన అనంతరం ఈ నెల 26న పవన్ కల్యాణ్ తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ వేడుకలు డెహ్రాడూన్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం.

Leave a Comment