Prevention of Eye Injuries – మన కంటికి అయ్యే గాయాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Prevention of Eye Injuries

మానవ శరీరంలో అతి సున్నితమైన భాగం కన్ను. అది మెదడులోని ప్రత్యేక ఇంద్రియాల సహకారంతో మనకు వివిధ రూపాలను చూడటం, వివిధ చర్యలను నిర్వహించటం సాధ్యమయ్యేలా చేస్తుంది. కంటి ముందున్న కాంతి మూలకాల ద్వారా సంకేతాలు కంటిని చేరతాయి. కంటి వెనుక భాగంలో గల సున్నితమైన పొర, రెటీనాపై ప్రతిబింబం ఏర్పడుతుంది. కంటి నరాల ద్వారా ఈ ప్రతిబింబం మెదడును చేరుతుంది. ఇలాంటి కీలకమైన కంటికి హాని కలిగితే దృష్టి తగ్గిపోతుంది.

 చాలా సందర్భాల్లో మన కంటికి గాయాలు అవుతుంటాయి.  క్రికెట్, కబడ్డీ, కోకో , వాలీబాల్ .. ఇలాంటి  ఆటలాడేటప్పుడు , రోడ్డు ప్రమాదాల్లో కంటికి తరచూ గాయాలవుతాయి.  కొన్నిసార్లు కంటికి రక్షణ కావచ్చమైన కార్నియా కూడా దెబ్బతినవచ్చు. ఈ కార్నియా మీద దెబ్బల వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఆటల వల్ల, ప్రమాదవశాత్తూ, పెన్సిల్‌లాంటి పదునైన వస్తువులు తగలటం వల్ల కార్నియా చిరిగిపోతుంది. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా చిరిగిపోయిన కార్నియాను కుట్టేయాలి. లేదంటే ఆ గాటు ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. కొన్నిసార్లు కార్నియాతోపాటు కంట్లోని తెల్లని భాగం స్క్లీరా కూడా చిరిగిపోవచ్చు. కంట్లో ఏ ప్రదేశంలో చిరుగు ఏర్పడింది? ఎంత పరిమాణంలో ఉంది? కుట్టు వేయాలా? అవసరం లేదా అనే విషయాలు కంటి వైద్యులు మాత్రమే గుర్తించగలరు. కొన్నిసార్లు కుట్టు వేసి కార్నియాను కాపాడగలిగినా కార్నియా మీద మచ్చ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి ‘విజువల్‌ యాక్సిస్‌’ మీద మచ్చ ఏర్పడితే చూపులో తేడా రావొచ్చు. అలాంటప్పుడు వైద్యులు కళ్లజోడు సూచిస్తారు. కాబట్టి కంటికి దెబ్బ తగిలి నీరు కారుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే కన్ను ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. క్రమంగా ఇన్‌ఫెక్షన్‌ మరింతగా  ముదిరిపోయి కార్నియా పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాదు  కార్నియా వెనుకభాగం కూడా దెబ్బతిని శుక్లాలు కూడా రావొచ్చు.                                                                                          

బాణాసంచా కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు ఒంటి మీద, కంట్లో కూడా పడుతూ ఉంటాయి. కంటికి గాయాలవుతాయి. కార్నియా డ్యామేజ్‌ అవ్వొచ్చు. ట్రమాటిక్‌ కాటరాక్ట్‌కు దారి తీయొచ్చు. కొన్నిసార్లు రెటీనా నరం దెబ్బతినొచ్చు. ఒకవేళ కాటరాక్ట్‌ ఏర్పడితే కార్నియాకు కుట్టు వేసి కాటరాక్ట్‌ తొలగించి లెన్స్ పెట్టి సరిచేయొచ్చు. దెబ్బ తీవ్రతను బట్టి రెటీనా డిటాచ్‌మెంట్‌ సర్జరీ చేసి రెటీనాను కూడా సరిచేయొచ్చు. దెబ్బ తగిలిన ప్రాంతం, తీవ్రతలను బట్టి కంట్లో ఏ భాగం దెబ్బతిందో వైద్యులు గమనించి అందుకు తగిన చికిత్స చేస్తారు. ఇలాంటి సమస్యలేవీ రాకుండా ఉండాలంటే టపాకాయలు కాల్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మెలగాలి.  కళ్లు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన విటమిన్, మినిరల్ ఫుడ్స్ తో పొట్టను నింపడం చాలా అవసరం. విటమిన్స్ కళ్ళు ఆరోగ్యంగా మరియు బ్రైట్‌గా ఉంచడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్షణ అవసరం. అందుకోసం కళ్ళు ఎక్కువగా ఎండలో స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా, కళ్ళును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ళలో ఏర్పడ్డ మురికి, డస్ట్‌ను తొలగించుకోవచ్చు.

Leave a Comment