Tamil Nadu Floor Test : విజయ్ సర్కార్​కు అనుకూలంగా 144 ఓట్లు – బలపరీక్షలో నెగ్గిన సీఎం

By manavaradhi.com

Published on:

Follow Us
Tamil Nadu Floor Test

తమిళనాడులో కొత్తగా విజయ్ నేతృత్వంలోని ఏర్పడిన టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కింది… కాదు కావలసిన మద్దతుకన్న ఎక్కవ సభ్యులనే కూడగట్టుకోవటంతో విజయ్‌కు అనుకూలంగా 144 ఓట్లు, వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. దీంతో విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు.

విశ్వాస పరీక్షపై తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. సభలో ముందుగా మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు తాము విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వాపక్షాలు మద్దతు ప్రకటించాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకున్న తొలి మూడు నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ఐదేళ్లపాటు కొనసాగాలని వీసీకే అశాభావం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్​డీగా జ్యోతిష్యుడిని విజయ్‌ నియమించడంపై అభ్యతరం వ్యక్తం చేసింది. విజ్ఞానశాస్త్రానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఐయూఎంఎల్‌ విజయ్‌కు మద్దతు ప్రకటించింది

టీవీకే ప్రభుత్వాన్ని డీఎంకేతో పాటు అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకించింది. బలపరీక్షకు ముందుగానే విజయ్‌, తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65 శాతం తమిళనాడు ఓటర్లు విజయ్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు దూరంగా ఉంటామని చెబుతూ 59 ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ ఓటింగ్‌లో ‘తటస్థంగా’ ఉండాలని నిర్ణయించింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు అన్నాడీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

చర్చ అనంతరం టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ విజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల కాలం పాలిస్తుందని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఓటు వేయనివారిది కూడా అని విజయ్‌ పేర్కొన్నారు.

Leave a Comment