RBI : మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం.. ఎప్పటి నుంచి అంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టంచేసింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.. దీంతో చాలా మంది పెద్ద ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. ఇప్పటి వరకు ఎవరైతే తమ బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ అంటే ( మినిమమ్ బ్యాలెన్స్) ఉంచలేదో వారిని నుంచి ఛార్జీలు వసులు చేసేవి బ్యాంకులు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ.. వాటిని నిరుపయోగంగా లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది. అంతే కాదు వారినుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయొదని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలను జారీచేసింది.

మార్చిన ఈ నిబందనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్‌బీఐ ఈ సర్క్యులర్‌ చేయడం వెనక ఒక కారణం ఉంది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్‌బీఐ ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతేకాదు మరిన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వీటి ప్రకారం వాడుకలో లేని ఖాతాల గురించి సమాచారాన్ని ముందుగా బ్యాంకులు ఎస్సెమ్మెస్‌, లెటర్‌, లేదా ఇ-మెయిల్‌ రూపంలో ఖాతాదారులకు తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ వెల్లడించింది. దీని ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గించవచ్చు అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తుంది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల పట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరుగుతున్నాయి. 2023 మార్చి నెల వరకు ఎవరూ క్లెయిమ్ డిపాజిట్లు రూ.42,272 కోట్లు ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. అయితే గత సంవత్సం ఈ మొత్తం రూ.32,934 కోట్లుగా ఉంది. అంటే ప్రతి సంవత్సం ఈ మొత్తం భారీగా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి వాటిని క్లెయిమ్‌ చేసుకోకుండా ఉన్న ఈ తరహా డిపాజిట్లను వారసులు లేదా హక్కుదార్లు గుర్తించేందుకు వీలుగా UDGAM పేరిట ఓ కేంద్రీకృత వెబ్‌ పోర్టల్‌ను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇందులోను ఒకవేళ ఎవరైనా 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా ఖాతాలో డిపాజిట్‌ అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటేనే దానిని ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌’ ఫండ్‌ పథకానికి బదిలీ చేస్తారు.

Leave a Comment